మాజీ ప్రధాని సమాచారం లేదు:పీఎంఓ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని చంద్రశేఖర్ జన్మదిన తేదీకి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)కు స్పష్టం చేసింది. ఫరుఖాబాద్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త శివనారాయణ్ శ్రీవాస్తవ పీఎంఓ ఇందుకు సంబంధించిన తేదీపై స్పష్టత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. పీఎంఓ వెబ్సైట్లో చంద్రశేఖర్ జన్మదిన తేదీని జులై1గా నమోదు చేశారని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఏప్రిల్ 17న ఆయన జన్మదిన సెలవుగా ఇస్తుందని ఆయన తెలిపారు. దీంతో సరైన తేదీన ఆయన జన్మదినాన్ని జరపాలని ఆయన సీఐసీని ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఏమీ లేవని పీఎంఓ సీఐసీకి స్పష్టం చేసింది.
చంద్రశేఖర్ జులై 1,1927 న ఉత్తరప్రదేశ్ బల్లాయి జిల్లాలోని ఇబ్రహీంపట్టి గ్రామంలో జన్మించారు. ఆయన 1977 నుంచి1988 వరకు జనతా పార్టీ అధ్యక్షునిగా పని చేశారు. నవంబర్10,1990 నుంచి జూన్1,1991 వరకు భారత ఎనిమిదవ ప్రధానిగా సేవలందించారు.