పంద్రాగస్టు స్పీచ్‌తో సరికొత్త రికార్డు | PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టు స్పీచ్‌లో మోదీ రికార్డు.. ఏకంగా 98 నిమిషాలపాటు ప్రసంగం

Published Thu, Aug 15 2024 5:32 PM | Last Updated on

PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM1
1/14

ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా 78వ స్వాంతంత్ర్య వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు.

PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM2
2/14

ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వ సారి త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా మోదీ అరుదైన ఘనత సాధించారు.

PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM3
3/14

నేడు జాతిని ఉద్దేశించి 98 నిమిషాల పాటు సుధీర్ఘ ప్రసంగం చేశారు ప్రధాని. దీంతో అత్యధిక సమయం సుదీర్ఘ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా మోదీ నిలిచారు.

PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM4
4/14

అంతకముందు కూడా 2016లో పంద్రాగస్టున అత్యధిక సమయం 96 నిమిషాల ప్రసంగం చేశారు. కాగా 2017లో దాదాపు 56 నిమిషాల పాటు మాట్లాడారు మోదీ.. ఆయన చేసిన ప్రసంగాల్లో ఇదే అతని చిన్నది కావడం విశేషం.

PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM5
5/14

ఎర్రకోట మీద అత్యధికంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, పంద్రాగస్టు ప్రసంగాలు చేసిన ప్రధానుల్లో మోదీ మూడో స్థానంలో ఉన్నారు. మొత్తంగా 17 సార్లు అత్యధికంగా ప్రసంగాలతో ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డులకెక్కగా.. ఆయన తర్వాత ఇందిరాగాంధీ 16సార్లు స్వాత్రంత్య దినోత్సవం నాడు జాతినుద్దేశించి ప్రసంగించారు

PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM6
6/14

2014లో ప్రధానమంత్రిగా ఎర్రకోట నుంచి మోదీ తొలి ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఆ ఏడాది 65 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు. 2015లో 86 నిమిషాలు ప్రసంగించారు.

PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM7
7/14

2016లో ఏకంగా 96 నిమిషాల పాటు ప్రసంగం చేశారు. 2017లో గంట కంటే తక్కువగా 56 నిమిషాల పాటు మాట్లాడారు.

PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM8
8/14

2018లో 83 నిమిషాలు ప్రసంగించారు. 2019లో రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత పాల్గొన్న తొలి స్వాతంత్ర్య వేడుకల్లో 92 నిమిషాల పాటు ప్రసంగం చేశారు.

PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM9
9/14

2020లో 90 నిమిషాలు, 2021లో 88 నిమిషాలు ప్రసంగించారు.

PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM10
10/14

2022లో 74 నిమిషాలు, 2023లో 90 నిమిషాలు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు

PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM11
11/14

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేడు 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇది ఆయన ప్రధానమంత్రి హోదాలో 11వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.

PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM12
12/14

మోదీ కంటే ముందు 1947లో జవహర్‌లాల్ నెహ్రూ, 1997లో ఐకే గుజ్రాల్ వరుసగా 72.. 71 నిమిషాలు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు.

PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM13
13/14

1954లో నెహ్రూ, 1966 ఇందిరా గాంధీ కేవలం 14 నిమిషాల అతి తక్కువ ప్రసంగాలు చేశారు.

PM Modi delivers longest ever Independence Day speech by an Indian PM14
14/14

2012, 2013లో మన్మోహన్‌ సింగ్‌ కేవలం 32, 5 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. 2002 2003లో వాజ్‌పేయి కూడా 25, 30 నిమిషాలే ప్రసంగించారు

Advertisement
 
Advertisement
Advertisement