ఓటుకు నోటు కాంగ్రెస్‌ చలవే | vote for note congress fault | Sakshi
Sakshi News home page

ఓటుకు నోటు కాంగ్రెస్‌ చలవే

Published Sun, Sep 18 2016 1:20 AM | Last Updated on Mon, Sep 17 2018 7:44 PM

vote for note congress fault

ఆకివీడు : ఓటుకు నోటును అలవాటు చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా మండల పార్టీ అధికార ప్రతినిధి నేరెళ్ల పెదబాబు రైస్‌ మిల్లు వద్ద కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో అవినీతి వేళ్లూనుకుపోయిందన్నారు. అధికారులకు లంచాలు ఇచ్చి పనిచేయించుకునే అలవాటును నేర్పించారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో 268 మందికి పరీక్షలు నిర్వహించిన మందులు అందజేశారు. పెదబాబు, పట్టణ కమిటీ అధ్యక్షుడు యర్రా రఘురామ్, రైల్వే బోర్డు మాజీ సభ్యుడు వాడపల్లి రాంబాబు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement