
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నగర పర్యటన Modi Hyderabad Tour నేపథ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 26న గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ(ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలో.. ప్రధాని మోదీ టూర్ కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్‌పీజీ) రంగంలోకి దిగింది. ఐఎస్‌బీ క్యాంపస్‌ను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్న ఎస్‌పీజీ.. పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఇక ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో.. మొత్తం 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.
వీళ్లలో మొహాలీ క్యాంపస్ కు చెందిన 330 విద్యార్థులు కూడా ఉన్నారు. దీంతో మొత్తం 930 మంది సోషల్ మీడియా అకౌంట్స్‌ను జల్లెడపడుతున్నారు అధికారులు. ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు ఉన్నాయా? అని వాళ్ల అకౌంట్లను పరిశీలిస్తున్నారు. విద్యార్థుల బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేస్తున్న ఎస్పీజి అధికారులు.. అంతా క్లియర్‌గా ఉంటేనే పాస్‌లతో అనుమతించాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment