PM Hyderabad Visit Live Updates:
03:20PM
► మోదీ హెలికాప్టర్‌కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్డు మార్గంలో ప్రధాని బేగంపేటకు వెళ్లారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లనున్నారు.
02:40PM
ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. ఐఎస్‌బీ తన ప్రయాణంలో కీలక మైలురాయికి చేరిందన్నారు. 2001 లో వాజ్‌పేయ్ ఐఎస్‌బీని ప్రారంభించారని తెలిపారు.ఎంతోమంది కృషి వల్లే ఐఎస్‌బీ ఈ స్థాయికి చేరిందన్నారు. ఆసియాలో టాప్ బిజినెస్ స్కూల్‌గా ఐఎస్‌బీ ఎదిగిందన్నారు. ఐఎస్‌బీ విద్యార్థులు అనేక స్టార్టప్‌లుప్రారంభించారని పేర్కొన్నారు.
02:12PM
ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొననున్న మోదీ.
► కాసేపట్లో ఐఎస్‌బీకి చేరుకోనున్న ప్రధాని మోదీ.
01:35PM
ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సభా వేదికలో ప్రధాని మోదీ ప్రసంగం సుమారు 30 నిమిషాలపాటు సాగింది. ఈ ప్రసంగంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసి మాట్లాడారు ప్రధాని మోదీ.
01:06PM
► ఇంత ఎండలో చెమటలు కారుస్తూ వచ్చిన కార్యకర్తలకు కృతజ్ఞతలు. మీ ప్రేమే నా బలం. తెలంగాణకు ఎప్పుడొచ్చినా మీ రుణం పెరిగిపోతోంది అనిపిస్తోంది: ప్రధాని మోదీ.
ప్రధాని ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు.. బేగంపేట ఎయిర్‌పోర్ట్ దగ్గర ఈ స్వాగతాన్ని చూశాక బీజేపీ పోరాటం ఫలితాన్నిస్తోందని అర్థమవుతోంది. ఇక తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. తెలంగాణలో మార్పు తథ్యం. ఒక్క కుటుంబం తెలంగాణ అభివృద్ధిని అణిచివేయాలని చూస్తోంది. కుటుంబ పార్టీలు దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదం. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఒక్క కుటుంబం సంక్షేమం కోసమే కొన్ని పార్టీలు పని చేస్తున్నాయి.
► పట్టుదలకు, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం: ప్రధాని మోదీ
01:05PM
►తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రంసంగంతో మొదలైన సమావేశం.. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం
01.04PM
►గురువారం మధ్యాహ్నాం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకున్నారు. ముందుగా బీజేపీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు బేగంపేట్ చేరుకుని.. భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తిస్తున్నాయి.
12:57PM
►భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఐఎస్‌బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గురువారం ప్రధాని మోదీ నగరానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment