SPG
-
ప్రధాని మోదీ పక్కన ‘లేడీ ఎస్పీజీ’ వైరల్ : తప్పులో కాలేసిన కంగనా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫోటో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో లేడీ ఎస్పీజీ అంటూ ఈ ఫోటోను షేర్ చేయడం మరింత చర్చకు దారి తీసింది. ప్రధాని భద్రతా విభాగం ఎస్పీజీలోకి కొత్తగా మహిళా కమాండో చేరిందంటూ సందడి మొదలైంది. అసలు సంగతి ఏంటంటే..బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంట్ వద్ద నరేంద్రమోదీతో పక్కన బ్లాక్ డ్రెస్‌లో నడుస్తున్న ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేశారు. దీంతో ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఎస్పీజీ అంటూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొన్ని మహిళా ఎస్పీజీ కమాండోలు 'క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్'లో సభ్యులుగా ఉన్నారని వెల్లడించాయి. అలాగే ఆ ఫోటోలో కనిపించిన మహిళ ఎస్పీజీ బృందంలో భాగమని అనుకోవడం తప్పు అని కూడా భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేటాయించిన వ్యక్తిగత భద్రతా అధికారి అని వెల్లడించాయి. అయితే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న ఈ అధికారి పేరు లేదా ఇతర వివరాలు మాత్రం వెల్లడించలేదు.కాగా భారత ప్రధానమంత్రి, మాజీ ప్రధాన మంత్రులు, వారి కుటుంబాలకు భద్రత కల్పించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ 1985లో ఏర్పాటైంది. ఇది అత్యున్నత ప్రొఫెషనల్ భద్రతా సంస్థ. -
వరుసగా బెదిరింపు ఈమెయిళ్లు.. అంబానీ భద్రత గురించి తెలుసా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి వరుసగా బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయి. గతంలో రూ.20 కోట్లు, రూ.200 కోట్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో మెయిళ్లు రాగా.. తాజాగా రూ.400 కోట్ల డిమాండ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ బెదిరింపులకు పాల్పడుతున్న దుండగులు ముఖేశ్ అంబానీపై ప్రత్యక్షంగా దాడి చేసే ప్రయత్నం చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఆయనకు కల్పిస్తున్న భద్రత అలా ఉంది మరి! ప్రస్తుతం అంబానీకి జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతేడాది నుంచే భద్రతను పెంచింది. గతంలో ముంబైలోని ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో బాంబు భయం తర్వాత పారిశ్రామిక వేత్తల భద్రతపై కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. భద్రత ఎవరికంటే.. ప్రముఖులకు సంఘ విద్రోహశక్తుల నుంచి అపాయం ఉందని భావిస్తే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత ఏర్పాటు చేస్తుంది. వీరిలో అత్యధిక ప్రజాదరణ కలిగి..వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని నిఘా సంస్థలు అందించే సమాచారం ఆధారంగా భద్రత అందిస్తారు. సంఘ విద్రోహశక్తుల నుంచి వీరిని కాపాడడం వారి విధి. నిఘా సంస్థ అందించే రిపోర్ట్ ఆధారంగా వివిధ రకాల భద్రతా కేటగిరీలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారికి కేటాయిస్తుంది. ప్రమాదాలను అంచనా వేసి భద్రతా వర్గాన్ని ఐదు గ్రూపులుగా విభజించింది. వాటిలో ఎక్స్, వై, జెడ్, జెడ్ ప్లస్, ఎస్పీజీ వర్గాలున్నాయి. భారత్‌లోని వీఐపీలు, వీవీఐపీలు, ఇతర ఉన్నత స్థాయి లేదా రాజకీయ ప్రముఖులకు ఈ రకమైన భద్రత ఏర్పాటు చేస్తుంది. అయితే గతేడాది నుంచి ముకేశ్ అంబానీకి జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత అందిస్తుంది. జెడ్ ప్లస్ భద్రత అంటే.. రక్షణలో ఎస్పీజీ తర్వాత జెడ్ ప్లస్ భద్రత అనేది రెండో అత్యధిక స్థాయి భద్రతా. ఇందులో భాగంగా 10+ ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసు అధికారులతో కలుపుకుని 55మంది సిబ్బంది వీరికి రక్షణగా ఉంటారు. వీరంతా మార్షల్ ఆర్ట్స్, పోరాట శిక్షణలో నైపుణ్యం పొందినవారు. ఈ కేటగిరీలో భాగంగా 5+ బులెట్‌ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. దేశంలో ఇప్పటివరకు కేవలం 43 ప్రముఖులకు మాత్రమే ఈ భద్రత కల్పిస్తున్నారు. భద్రత సిబ్బంది వేతనాలు, ప్రయాణ భత్యాలు, వాహనాలు వంటి ఖర్చులను సందర్భాన్ని బట్టి వివిధ ఏజెన్సీలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రత పొందే వ్యక్తులు, సంస్థలు భరిస్తాయి. ఎస్పీజీ మాత్రం దేశ ప్రధానికి భద్రత కల్పిస్తుంది. -
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. సోషల్ మీడియాలో విద్యార్థుల పోస్టులపై నిఘా
-
పీఎం మోదీ హైదరాబాద్ పర్యటన.. సోషల్ మీడియా జల్లెడ!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నగర పర్యటన Modi Hyderabad Tour నేపథ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 26న గచ్చిబౌలిలోని ఐఎస్బీ(ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రధాని మోదీ టూర్ కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) రంగంలోకి దిగింది. ఐఎస్బీ క్యాంపస్‌ను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్న ఎస్పీజీ.. పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఇక ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో.. మొత్తం 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. వీళ్లలో మొహాలీ క్యాంపస్ కు చెందిన 330 విద్యార్థులు కూడా ఉన్నారు. దీంతో మొత్తం 930 మంది సోషల్ మీడియా అకౌంట్స్‌ను జల్లెడపడుతున్నారు అధికారులు. ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు ఉన్నాయా? అని వాళ్ల అకౌంట్లను పరిశీలిస్తున్నారు. విద్యార్థుల బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేస్తున్న ఎస్పీజి అధికారులు.. అంతా క్లియర్‌గా ఉంటేనే పాస్‌లతో అనుమతించాలని భావిస్తున్నారు. -
ఎస్పీజీ బిల్లుకు పార్లమెంటు ఓకే
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖులకు రక్షణ కల్పించే ఎస్పీజీ చట్టానికి చేసిన సవరణకు రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలిపింది. రాజకీయ కక్షతోనే చట్ట సవరణ చేశారన్న ప్రతిపక్షాల ఆరోపణలను హోం మంత్రి తిరస్కరించగా, ఇదే అంశంపై తమ నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చకు హోం మంత్రి సమాధానమిస్తూ ప్రభుత్వం దేశంలోని 130 కోట్ల మంది ప్రజల భద్రతపై ఆలోచన చేసిందని, ఒక్క గాంధీ కుటుంబం గురించి మాత్రం కాదని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయమూ తీసుకోదని, గతంలో కాంగ్రెస్ పార్టీ నే అలాంటి నిర్ణయాలు అనేకం తీసుకుందని విమర్శించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్, దేవెగౌడ, మన్మోహన్ సింగ్‌ల ఎస్పీజీ భద్రతపై సమీక్షలు జరిపినప్పుడు ఎలాంటి చర్చ జరగలేదని, ఆయన అన్నారు. అయితే హోం మంత్రి సమాధానంపై సంతృప్తి చెందడం లేదంటూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ప్రధాని, కుటుంబ సభ్యులకు మాత్రమే.. ‘ప్రధానికి కేటాయించిన అధికారిక నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు ఎస్పీజీ రక్షణ కల్పిస్తాం. అధికారం కోల్పోయిన రోజు నుంచి ఈ సేవలు నిలిపివేస్తారు’ అని అమిత్ షా వివరించారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇంట్లోకి ఆగంతకుల చొరబాటును ప్రస్తావిస్తూ.. నల్లటి టాటా సఫారీ వాహనంలో రాహుల్ వస్తారని ప్రియాంకకు సమాచారం ఉందని, కానీ మీరట్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు అదే వాహనంలో రావడంతో సిబ్బంది లోనికి అనుమతించారన్నారు. ఈ సంఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. -
ఏ కుటుంబాన్ని టార్గెట్ చేయలేదు : అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : ఏ ఒక్క కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేయలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. రాజ్యసభలో ఎస్పీజీ సవరణ బిల్లుపై జరిగిన చర్చకు అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీజీ అనేది స్టేటస్ సింబల్ కాదని వ్యాఖ్యానించారు. ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఎస్పీజీ చట్టానికి సవరణ చేయడం ఇది ఐదవసారి అని అమిత్ షా గుర్తుచేశారు. అయితే గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సవరణ చేయలేదని స్పష్టం చేశారు. కానీ గతంలో జరిగిన నాలుగు సవరణలు కూడా గాంధీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకునే జరిగాయని విమర్శించారు. ఎస్పీజీ భద్రతను కేవలం గాంధీ కుటుంబానికే కాకుండా.. మాజీ ప్రధానులకు కూడా తొలగించిన విషయాన్ని గమనించాలన్నారు. కేవలం గాంధీ కుటుంబాన్ని మాత్రమే కాదు.. దేశంలోని ప్రతి ఒక్కరిని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు గాంధీ కుటుంబానికి ఎస్పీజీ కావాలని ఎందుకు పట్టుబడుతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ముప్పు ఆధారంగానే భద్రత తొలగించినట్టు స్పష్టం చేశారు. ఎస్పీజీ భద్రత ప్రధాన మంత్రికి మాత్రమే ఉంటుందని వెల్లడించారు. అమిత్ షా ప్రసంగం అనంతరం.. ఎస్పీజీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అయితే దీనిని నిరసిస్తూ కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. కాగా ఎస్పీజీ సవరణ బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఆ ఘటన యాదృచ్ఛికంగా జరిగింది : షా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇంటి వద్ద భద్రత లోపంపై అమిత్ షా స్పందించారు. ఎస్పీజీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగిందన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్సెండ్ చేసినట్టు వెల్లడించారు. -
ఎస్పీజీ స్టేటస్ సింబల్ కాదు : విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్పీజీ భద్రత స్టేటస్ సింబల్ కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఎస్పీజీ సవరణ బిల్లుపై ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. వ్యక్తులకు ఉన్న ముప్పును ఆధారంగా చేసుకుని ఎస్పీజీ భద్రత కల్పించాలని కోరారు. కేవలం ఒక కుటుంబంలో జన్మించిన కారణంగా ఎస్పీజీ భద్రత ఇవ్వాలనేది సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వలసవాద మనస్తత్వాన్ని విడనాడలని తెలిపారు. సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన ఎస్పీజీ సవరణ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నట్టు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఎర్ర బల్బు సంస్కృతిని పారద్రోలారని.. అదే పద్ధతిలో ఎస్పీజీ సవరణను తీసుకురావడం స్వాగతించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఐటీపై టాస్క్ ఫోర్స్ నివేదిక అందింది : కేంద్రం ఆదాయపు పన్ను చట్టాన్ని సమీక్షించేందుకు నియమించిన టాస్క్ ఫోర్స్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. టాస్క్ ఫోర్స్ సిఫార్సులను పరిగణలోకి తీసుకునే విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆదాయ పన్ను చట్టాన్ని సమీక్షించి దేశంలో నెలకొన్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కొత్తగా ప్రత్యక్ష పన్నుల చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం 2017లోనే టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం వాస్తమేనని మంత్రి వెల్లడించారు. ఆ తర్వాత 2018, 2019 లలో ఈ టాస్క్ ఫోర్స్‌ను పున:వ్యవస్థీకరించడం జరిగిందని మంత్రి తెలిపారు. అలా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ గత ఆగస్టు 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు చెప్పారు. టాస్క్ ఫోర్స్ తన నివేదికలో చేసిన సిఫార్సులను బహిర్గతం చేయలేదని, అలాగే ఆ సిఫార్సులను పరిగణలోకి తీసుకునే అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. విశాఖలో ఆయుర్వేద, హోమియో డిస్పెన్సర్సీలకు ఆమోదం విశాఖపట్నంలో కేంద్ర ప్రభత్వ హెల్త్ స్కీమ్(సీజీహెచ్ఎస్) కింద ఆయుర్వేద, హోమియో డిస్పెన్సరీలు ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ఆరోగ్య శాఖ సహాయం మంత్రి అశ్వినీకుమార్ చెప్పారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు జవాబు ఇచ్చారు. -
ఆ కుటుంబాలకు ఎస్పీజీ 'నో'
న్యూఢిల్లీ: ఇకపై మాజీ ప్రధానమంత్రుల కుటుంబ సభ్యులకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కమెండోల భద్రతను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్పీజీ చట్టానికి ఈ మేరకు చేసిన సవరణల్ని కేంద్ర కేబినెట్ ఆమోదించినట్టుగా ప్రభుత్వ అధికారులు శుక్రవారం వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె సంతానం రాహుల్, ప్రియాంకలకు మూడు దశాబ్దాల తర్వాత ఎస్పీజీ భద్రత తొలగించిన కొద్ది రోజులకే మాజీ ప్రధానుల కుటుంబాలకూ దీనిని వర్తింపజేయనున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు సవరణ బ్లిలును వచ్చే వారం లోక్‌సభలో ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోకసభలో చెప్పారు. ఎస్పీజీ చట్టం ప్రకారం కమెండోల రక్షణ ప్రధానమంత్రి, ఆయన కుటుంబసభ్యులకు ఉంటుంది. ఇక మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు పదవీ కాలం ముగిసిన ఏడాది వరకు రక్షణ కల్పిస్తారు. ఆ తర్వాత మాజీ ప్రధానులకు వారికున్న ముప్పు ఆధారంగా పరిస్థితుల్ని సమీక్షించి ఎస్పీజీ భద్రత కొనసాగిస్తారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించిన సవరణ బిల్లు ప్రకారం మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రతను ఇకపై కల్పించరు. -
ఎస్పీజీ డైరెక్టర్‌కు సోనియాగాంధీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : తమ కుటుంబానికి 28 ఏళ్లుగా రక్షణగా ఉన్న ఎస్పీజీ భద్రతా విభాగానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలకు ఎస్పీజీ రక్షణ హోదా తొలగిస్తూ కేంద్రప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎస్పీజీ స్థానంలో సీఆర్పీఎఫ్ దళాలతో జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించారు. ఈ నిర్ణయంపై రాహుల్ గాంధీ ఆరోజే స్పందించగా, సోనియా గాంధీ ఒకరోజు ఆలస్యంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఎస్పీజీ డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హాకు లేఖ రాశారు. పని పట్ల నిబద్దత, అంకితభావంలలో ఎస్పీజీ సిబ్బంది పనితీరు అత్యుత్తమమని ఆ లేఖలో ప్రశంసించారు. మరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత, రాజకీయ కక్షలతో నెహ్రూ కుటుంబాన్ని వేధిస్తున్నారని మండిపడుతున్నారు. కాగా, 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం నెహ్రూ కుటుంబానికి ఎస్పీజీ రక్షణ కల్పిస్తూ అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రమాదంలో ప్రధాని భద్రత
న్యూఢిల్లీ: మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతకు ముప్పు ఏర్పడిందని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. ప్రధాని భద్రతకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు కొత్తగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అనుమతి లేకుండా మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ప్రధానికి దగ్గరగా వెళ్లడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. ప్రధాని మోదీకి ఊహించని ముప్పు పొంచి ఉందని, 2019 ఎన్నికలకు సంబంధించి సంఘ వ్యతిరేక శక్తులకు ప్రధాని మోదీనే అత్యంత విలువైన లక్ష్యమని ఆ మార్గదర్శకాల్లో హెచ్చరించారు. ‘ఎవరూ కూడా, చివరకు మంత్రులు కూడా ఎస్పీజీ అనుమతి లేకుండా ప్రధాని దగ్గరకు వెళ్లడానికి వీల్లేదు’ అని వాటిలో స్పష్టంగా పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ప్రధాని మోదీనే కీలక ప్రచారకర్తగా వ్యవహరించాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో రోడ్ షోల సంఖ్యను తగ్గించుకోవాలని ప్రధానికి ఎస్పీజీ సూచించినట్లు సమాచారం. రోడ్‌షోల సమయంలో దాడులకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని, అందువల్ల ఎక్కువగా బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటే మంచిదని, బహిరంగ సభలకు భద్రత ఏర్పాట్లు చేయడం కొంతవరకు సులభమవుతుందని ఎస్పీజీ ప్రధానికి వివరణ ఇచ్చింది. తాజా మార్గదర్శకాలను ప్రధాని భద్రతను పర్యవేక్షించే క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ అధికారులకు వివరించారు. అవసరమైతే, మంత్రులను, అధికారులను కూడా తనిఖీ చేసేందుకు వెనకాడవద్దని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా మావోల ప్రభావం అధికంగా గల రాష్ట్రాలను సున్నిత ప్రాంతాలుగా గుర్తించి.. ఆయా రాష్ట్రాల పోలీసు చీఫ్‌లు ప్రధాని పర్యటనకు వచ్చినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ ఆదేశించింది. మావోల లేఖ వల్లనే!: రాజీవ్ గాంధీ హత్య తరహాలో మోదీని హతమార్చేందుకు అవకాశాలున్నాయంటూ పలు వివరాలున్న ఒక లేఖను పుణె పోలీసులు ఇటీవల బహిర్గత పర్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో మావోయిస్టు సానుభూతిపరుల నుంచి ఆ లేఖను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దాంతో ప్రధాని భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మరోవైపు, ఇటీవలి పశ్చిమబెంగాల్ పర్యటన సమయంలో.. ఆరంచెల భద్రతావలయాన్ని ఛేదించుకుని మరీ ఓ వ్యక్తి మోదీకి దగ్గరగా వచ్చిన ఘటన భద్రతా దళాలకు ముచ్చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలోనే.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్‌లతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. -
ఇవాంకా భద్రతపై వైట్‌హౌస్ వర్సెస్ ఎస్పీజీ
సాక్షి, హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భద్రత విషయంలో వైట్ హౌస్ సెక్యూరిటీ విభాగాలు.. కేంద్ర హోంశాఖతోపాటు ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)కు స్పష్టమైన సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ఆమె పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్ఐసీసీలో జరిగే ప్రపంచ పారిశ్రామిక సదస్సులోకి పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయుధాలతో ప్రవేశించేందుకు వీల్లేదని అమెరికా సెక్యూరిటీ వింగ్ స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే ఇవాంక ట్రంప్ భద్రతతో పాటు దేశ ప్రధాని మోదీ భద్రత కూడా ముఖ్యమని, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతలో ఉన్న ప్రధాని వెనుక ఆర్మ్డ్ సిబ్బంది ఉండాలని కేంద్ర హోంశాఖతో పాటు ఎస్పీజీ పట్టుబడుతోంది. అయితే గతంలో టర్కీలో జరిగిన హైకమిషనర్ కాల్పుల వ్యవహారంతో అమెరికన్ సెక్యూరిటీ సదస్సులోకి ఎవరూ ఆయుధాలు తేవద్దన్న నిబంధనను పెడుతున్నట్టు కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఇవాంకా ట్రంప్ భద్రతకు సంబంధించి అమెరికన్ సెక్యూరిటీయే ప్రత్యేకంగా వాహనాలు, సిబ్బందిని రంగంలోకి దించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా సదస్సు బయటే ఎస్పీజీ, కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని అమెరికన్ వైట్‌హౌస్ కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసినట్టు రాష్ట్ర పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కేంద్ర హోంశాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, స్పెçషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు త్వరలోనే రాష్ట్రంలో పర్యటించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర వర్గాలు తెలిపాయి. -
వాద్రాకు ఎస్ పీజీ రక్షణ అవసరం లేదు: ప్రియాంక
ఢిల్లీ: సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు రక్షణ తొలగించడంపై ఆయన సతీమణి ప్రియాంక గాంధీ స్పందించారు. నా భర్తకు ఎస్పీజీ రక్షణ అవసరం లేదని ప్రియాంక వ్యాఖ్యానించారు. రాబర్ట్ వాద్రా కు రక్షణ తొలగించాలంటూ కేంద్రానికి ప్రియాంక లేఖ రాశారు. ప్రత్యేక రక్షణ కల్పించాలి మేం ఎన్నడూ కోరలేదని ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. విమానాశ్రయాల్లో తనకు, తన కుటుంబానికి ఉన్న ప్రత్యేక హోదా తొలగించాలని ఎస్పీజీకి ప్రియాంక లేఖ రాశారు. -
యశోదాబెన్ కూడా ఎస్పీజీ భద్రత
భోపాల్: వాళ్లిద్దరూ దశాబ్దకాలంగా కలిసి ఉన్న దాఖలాలు లేవు. కాని కాబోయే దేశ ప్రధాని భార్య అనే హోదా మాత్రం ఆమెకు దక్కింది. ఆమె హోదాకు తగినట్టుగానే భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదంతా కాబోయే ప్రధాని నరేంద్రమోడీ భార్య యశోదా బెన్ భద్రత గురించి. మోడీకి ఇచ్చే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను యశోదాబెన్ కు ఇవ్వాలని కల్పించనున్నారు. ప్రధాని కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రతను కేటాయించాలనే నిబంధన ఉందని.. ఆ చట్ట ప్రకారమే మోడీ భార్యతోపాటు ఇతర సభ్యులకు ఎస్పీజీ భద్రతను కల్పిస్తున్నామని మధ్యప్రదేశ్ మాజీ పోలీస్ డైరెక్టరేట్ జనరల్ సుభాష్ చంద్ర పీటిఐకి వెల్లడించారు. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ కు సుభాష్ చంద్ర సెక్యూరిటీ అధికారిగా సేవలందించారు. -
మోడీ కుటుంబానికి భద్రత