వాద్రాకు ఎస్ పీజీ రక్షణ అవసరం లేదు: ప్రియాంక
ఢిల్లీ: సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు రక్షణ తొలగించడంపై ఆయన సతీమణి ప్రియాంక గాంధీ స్పందించారు. నా భర్తకు ఎస్‌పీజీ రక్షణ అవసరం లేదని ప్రియాంక వ్యాఖ్యానించారు. రాబర్ట్ వాద్రా కు రక్షణ తొలగించాలంటూ కేంద్రానికి ప్రియాంక లేఖ రాశారు.
ప్రత్యేక రక్షణ కల్పించాలి మేం ఎన్నడూ కోరలేదని ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. విమానాశ్రయాల్లో తనకు, తన కుటుంబానికి ఉన్న ప్రత్యేక హోదా తొలగించాలని ఎస్‌పీజీకి ప్రియాంక లేఖ రాశారు.