Indian School of Business
-
పరీక్షల్లో మార్పులు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో పరీక్షల విధానాన్ని, మూల్యాంకన పద్ధతిని సమూలంగా మార్చబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తెచ్చేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఈ దిశగా అధ్యయనానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కి ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ ప్రక్రియలో భాగంగా సోమవారం జరిగే సమావేశం కీలకమైందిగా అధికారులు చెబుతున్నారు. కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సహా అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు ఈ భేటీకి హాజరవుతున్నారు. మరో ఆరు ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్స్‌ను సమావేశానికి ఆహ్వానించారు. విశ్వవిద్యాలయాల పరీక్షల విభాగం కంట్రోలర్స్ ఇప్పటి వరకూ జరుగుతున్న పరీక్షలకు సంబంధించిన డేటాను ఐఎస్బీకి అందజేయబోతున్నారు. ఈ సమావేశం అనంతరం ఐఎస్బీ బృందాలు దాదాపు వంద కాలేజీల నుంచి సమగ్ర సమాచారం సేకరిస్తాయి. వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న పరీక్షల విధానంపై స్టడీ చేస్తాయి. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని తెలంగాణ ఉన్నత విద్య కోర్సుల్లో అనుసరించాల్సిన సరికొత్త పరీక్షల ప్రక్రియపై ఐఎస్బీ నివేదిక ఇస్తుంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత దీన్ని అమలులోకి తెస్తామని ఉన్నత విద్య మండలి తెలిపింది. విభిన్న తరహా విశ్లేషణ డిగ్రీ, ఇంజనీరింగ్ సహా ఉన్నత విద్య పరిధిలోని అన్ని కోర్సుల్లో పరీక్షల విధానం ఎలా ఉంది? మార్కులు వేసే పద్ధతి ఏంటి? ఏ తరహా విద్యార్థికి ఎన్ని మార్కులొస్తున్నాయి? ఉన్నత విద్య తర్వాత విద్యార్థికి లభించే ఉపాధి ఏమిటి? అసలు విద్యార్థులు ఏం ఆశిస్తున్నారు? పరీక్షలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఈ తరహా డేటాను పరీక్షల విభాగం కంట్రోలర్స్ ఇప్పటికే సేకరించారు. వీటినే ఐఎస్బీ ప్రామాణికంగా తీసుకుంటుంది. ఉన్నత విద్యలో అత్యధిక మార్కులు పొందినప్పటికీ, మార్కెట్ అవసరాలకు తగ్గట్టు వారిలో నైపుణ్యం ఉండటం లేదని అఖిల భారత సాంకేతిక విద్య మండలి అధ్యయనంలో వెల్లడైంది. కేవలం మార్కుల కోణంలోనే మూల్యాంకన విధానం ఉందని, విద్యార్థి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే తరహా అవసరమని భావించింది. వేగంగా విస్తరిస్తున్న బహుళజాతి సంస్థల్లో చేరేందుకు ఈ విధానం అవరోధంగా ఉందని గుర్తించారు. డిగ్రీ చేతికొచ్చిన విద్యార్థి ఉద్యోగ వేటలో ఎదురయ్యే పరీక్షల తంతును అందిపుచ్చుకునే తరహాలో శిక్షణ, పరీక్షలు, బోధన విధానం ఉండాలన్నదే సంస్కరణల ప్రధానోద్దేశ్యమని మండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. ఈ కోణంలోనే ఐఎస్బీ చేత అధ్యయనం చేయిస్తున్నట్టు చెప్పారు. ఇది అత్యంత సాంకేతికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని ఐఎస్బీ నిపుణుడు శ్రీధర్ తెలిపారు. -
వ్యాపారం.. లాభాపేక్ష మాత్రమే కాకూడదు
హఫీజ్‌పేట్: వ్యాపారంలో లాభాపేక్ష మాత్రమే ప్రాధాన్యం కాకూడదని.. సమాజంలోని అసమానతలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో ‘లీడర్షిప్ సమ్మిట్–2022’ను జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యాపార విద్య చదివే విద్యార్థులకు సైతం రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రాయోజిత వ్యాజ్యాలను నిలిపివేయాలని నిర్ణయించుకుంటే న్యాయవ్యవస్థలో సగం సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఈ దేశంలో న్యాయపరమైన మౌలిక సదుపాయాల స్థితి ఇంకా కొనసాగుతోందన్నారు. పెండింగ్ కేసులు న్యాయవ్యవస్థకు ఎప్పుడూ ఒక సవాల్‌గానే ఉంటాయన్నారు. వాటిని తగ్గించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం ఎప్పుడూ తాడుపై నడిచినట్లేనని ఆయన పేర్కొన్నారు. 16 నెలల్లో ఎన్నో మార్పులకు శ్రీకారం.. చీఫ్ జస్టి‹స్‌గా 16 నెలలు కొనసాగిన సమయంలో సుప్రీంకోర్టు కోర్టుకు 11 మంది న్యాయమూర్తులను, పలు హైకోర్టులకు 233 మందిని న్యాయమూర్తులను నియమించడం జరిగిందన్నారు. దేశంలో న్యాయవ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి తగిన ప్రణాళికతో ముందుకు సాగామని చెప్పారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం కూడా ప్రారంభించామని వివరించారు. ఇదిలా ఉంటే.. ఐఎస్బీ 20 ఏళ్ల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పురోభివృద్ధి సాధించిందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఐఎస్బీ ఏర్పాటు సమయంలో 250 ఎకరాల స్థలాన్ని కేటాయించడంపై కోర్టులో కేసు వేయగా.. అదనపు అడ్వొకేట్ జనరల్‌గా ఉంటూ కేసులో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన తీర్పు ఎప్పటికీ మరువలేమని చెప్పారు. ఆ తర్వాత 20 ఏళ్లకు ఇప్పుడు లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఐఎస్బీ భూ వ్యాజ్యానికి సంబంధించి అప్పటి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తీర్పు కాపీని డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్లకు జస్టిస్ ఎన్వీ రమణ అందజేశారు. అంతకుముందు లీడర్షిప్ సమ్మిట్ ప్రాధాన్యతను మదన్ పిల్లుట్ల వివరించారు. అనంతరం మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్‌కుమార్, డాక్టర్ జయంతి కుమరేశ్, లైట్‌స్పీడ్ పార్ట్నర్ అభిషేక్నాగ్, ది బెటర్ ఇండియా సహ వ్యవస్థాపకుడు అనురాధ కేడియా, మైగేట్ సీఈఓ విజయ్ అరిశెట్టి, తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఈడీ కేదార్లేలేతోపాటు పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్బీ అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు, రాష్ట్ర హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. -
ప్రపంచాన్ని నిడిపించగల సత్తా భారత యువతలో ఉంది: ప్రధాని మోదీ
-
బడా కంపెనీలు నడపడమే కాదు.. చిరు వ్యాపారులనూ గుర్తుపెట్టుకోండి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రులై వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) విద్యార్థులు పెద్దపెద్ద కంపెనీలను నడపడమే కాకుండా చిన్న వ్యాపారాలను, వ్యాపారులనూ గుర్తుపెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చిరు వ్యాపారులకు టెక్నాలజీని అందుబాటులోకి తేవడంతోపాటు కొత్త మార్కెట్లను గుర్తించి వారికి చేరువ చేయాలని సూచించారు. తద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఐఎస్బీ 20వ వార్షికోత్సవం, 2022 పీజీపీ విద్యార్థుల స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఐఎస్బీ హైదరాబాద్ క్యాంపస్‌తోపాటు మొహాలీ క్యాంపస్ విద్యా ర్థులతో ఉమ్మడిగా జరిగిన ఈ స్నాతకోత్సవంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రధాని ప్రోత్సాహకాలు అందించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ఈ అమృత ఘడియల్లో ఐఎస్బీ విద్యార్థులు తమ వ్యక్తిగత లక్ష్యాలకు దేశ ప్రయోజనాలనూ జోడించి ముందడుగు వేయాలని కోరారు. వారికి ఇదో గొప్ప అవకాశమన్నారు. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించిన ఐఎస్బీ ఇప్పుడు ప్రపంచంలోనే పేరెన్నికగన్న బిజినెస్ స్కూల్‌గా అవతరించిందని చెప్పారు. సంస్కరణల ఫలాన్ని దేశం చూస్తోంది... గత ప్రభుత్వాలు అసాధ్యంగా భావించిన అనేక పాలనా సంస్కరణలను తాము వేగంగా చేపట్టడం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన రిఫార్మ్ (సంస్కరణలు), పెర్ఫార్మ్ (పనిచేయడం), ట్రాన్స్‌ఫార్మ్ (మార్పు తీసుకురావడం) నినాదం ఫలితాలను దేశం ఇప్పుడిప్పుడే చూస్తోందని ప్రధాని తెలిపారు. జీ–20 దేశాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మొదలుకొని.. స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగంలో తొలి స్థానానికి, ఇంటర్నెట్, రిటైల్ రం గాల్లో రెండో స్థానానికి, స్టార్టప్‌ల రంగం, అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో మూడోస్థానంలో ఉండటాన్ని ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నా రు. ఇందులో ప్రభుత్వం మాత్రమే కాకుండా ఐఎస్బీ, వృత్తి నిపుణుల భాగస్వామ్యమూ ఉందన్నారు. భారతీయులకు, భారతీయ ఉత్పత్తులకూ తమ ప్రభుత్వ హయాంలో కొత్త గుర్తింపు, గౌరవం దక్కాయని, దేశ సమస్యల పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు, పరిష్కార మార్గాలు ఇప్పుడు ప్రపంచస్థాయిలో అమలవుతున్నాయని వివరించారు. దేశంలో వ్యాపారాభివృద్ధికి, విస్తరణకు ఇప్పుడున్న విస్తృత అవకాశాలను ఐఎస్బీ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. 2014 తరువాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చర్యలను ఐఎస్బీతోపాటు మేనేజ్మెంట్ విద్యార్థులు తమ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అమలు చేస్తే తప్పకుండా అద్భుత ఫలితాలు లభిస్తాయని మోదీ తెలిపారు. సంబంధిత వార్త: నమో హైదరాబాద్.. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అప్డేట్స్ మీపై నమ్మకం ఉంది... కరోనాను ఎదుర్కొన్న తీరు భారత్ సత్తాను ప్రపం చానికి మళ్లీ చాటిందని ప్రధాని చెప్పారు. ఈ దేశ యువత ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్న నమ్మకం తనకుందన్నారు. విద్యార్థుల హర్షధ్వానాల మధ్య ప్రధాని మరోసారి ఈ విషయాన్ని చెబుతూ ‘నాకు మీపై నమ్మకం ఉంది. మీకు మీపై ఆ నమ్మకం ఉందా?’ అని ప్రశ్నించి.. ‘ఉంది’ అన్న సమాధానాన్ని రాబట్టారు. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా ఇప్పుడు దేశం ఫిన్‌టెక్, వైద్యం, వైద్య విద్య, క్రీడల్లాంటి అనేక రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతోందని, అద్భుత ప్రగతి సాధిస్తోందని ప్రధాని గణాంకాలతో వివరించారు. ప్రజల భాగస్వామ్యం కూడా పెరిగిన కార ణంగానే స్వచ్ఛ భారత్, వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర హోం సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐఎస్బీ డీన్ పిల్లుట్ల మదన్‌తోపాటు చైర్మన్ హరీశ్ మన్వానీ, మొహాలీ క్యాంపస్ ముఖ్యాధికారి రాకేశ్ భారతీ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ వేదికపై ఉన్న ప్రముఖులను పేర్లతో పలకరించినా తలసానిని మాత్రం తెలంగాణ మంత్రిగానే ప్రస్తావించడం గమనార్హం! -
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. సోషల్ మీడియాలో విద్యార్థుల పోస్టులపై నిఘా
-
పీఎం మోదీ హైదరాబాద్ పర్యటన.. సోషల్ మీడియా జల్లెడ!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నగర పర్యటన Modi Hyderabad Tour నేపథ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 26న గచ్చిబౌలిలోని ఐఎస్బీ(ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రధాని మోదీ టూర్ కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) రంగంలోకి దిగింది. ఐఎస్బీ క్యాంపస్‌ను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్న ఎస్పీజీ.. పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఇక ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో.. మొత్తం 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. వీళ్లలో మొహాలీ క్యాంపస్ కు చెందిన 330 విద్యార్థులు కూడా ఉన్నారు. దీంతో మొత్తం 930 మంది సోషల్ మీడియా అకౌంట్స్‌ను జల్లెడపడుతున్నారు అధికారులు. ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు ఉన్నాయా? అని వాళ్ల అకౌంట్లను పరిశీలిస్తున్నారు. విద్యార్థుల బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేస్తున్న ఎస్పీజి అధికారులు.. అంతా క్లియర్‌గా ఉంటేనే పాస్‌లతో అనుమతించాలని భావిస్తున్నారు. -
తెలంగాణకు ప్రధాని మోదీ.. బీజేపీలో జోష్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న రాష్ట్రానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవంలో పాల్గొంటారు. 20 రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ ముఖ్యనేతల రాకతో రాష్ట్ర బీజేపీలో కొత్త జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నేతలతో చర్చలు జరుపుతున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టులో పార్టీ నేతలను ప్రధాని కలిసేలా కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్ నేతలతోనూ ప్రధాని భేటీ అయ్యేలా కార్యక్రమాలకు తుదిరూపు ఇస్తున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి ఇప్పటికే సమాచారం పంపారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే సందేశాన్ని మోదీ పర్యటన ద్వారా ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా కార్యక్రమాల నిర్వహణకు సంజయ్ కార్యచరణ రూపొందిస్తున్నారు. ఇది కూడా చదవండి: రాజ్యసభ ఎన్నికలు: టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ -
ఐఎస్బీ విద్యార్థులకు భలే బొనాంజా
సాక్షి, హైదరాబాద్: మేనేజ్మెంట్ విద్యకు నగరంలో క్రమంగా క్రేజ్ పెరుగుతోంది. నగరంలో ఈ విద్యకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ కోర్సు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అత్యధిక వేతనాలతో పలు బహుళజాతి కంపెనీల్లో కొలువులు దక్కినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. తాజాగా ఓ విద్యార్థికి రూ.34 లక్షల వార్షిక వేతనం దక్కినట్లు పేర్కొన్నాయి. హైదరాబాద్ నగరంతోపాటు మొహాలీలో ఉన్న తమ విద్యాసంస్థకు ఈ ఏడాది సుమారు 270 కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేపట్టేందుకు ముందుకొచ్చాయని తెలిపాయి. ఆయా కంపెనీలు 2,066 ఉద్యోగాలను ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాయి. వీటిలో దేశ, విదేశాలకు చెందిన పలు కార్పొరేట్, బహుళజాతి కంపెనీలుండడం విశేషం. వర్చువల్ విధానంలో చేపట్టిన నియామకాల్లో పలువురు విద్యార్థినీ విద్యార్థులు అత్యధిక వేతనంతో కొలువులు సాధించినట్లు ప్రకటించాయి. గతేడాది సరాసరిన అత్యధికంగా లభించిన వేతన ప్యాకేజీ రూ.28.21 లక్షలు కాగా.. ఈసారి రూ.34 లక్షలకు పెరగడం విశేషం. కొలువులు.. ప్యాకేజీల జాతర.. ► ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మేనేజ్మెంట్ విద్యలో పీజీ చేస్తున్న వారిలో 39 శాతం మంది మహిళలే ఉండడం విశేషం. అత్యధిక వేతనాలు దక్కించుకున్న వారిలోనూ 41 శాతం మంది అతివలే ఉన్నట్లు వర్సిటీ ప్రకటించింది. తమ సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విద్యనభ్యసిస్తున్న వారు సుమారు 929 మంది ఉన్నట్లు తెలిపింది. పలు రంగాల్లో అగ్రభాగాన ఉన్న కంపెనీలు తమ విద్యార్థులకు కొలువులు ఆఫర్ చేసినట్లు ప్రకటించింది. మేనేజ్మెంట్, సాంకేతికత, కన్సల్టింగ్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఐటీ,అనుబంధ రంగాలకు చెందిన కంపెనీలు సైతం 26 శాతం కొలువులను తమ విద్యార్థులకు ఆఫర్ చేసినట్లు ఐఎస్బీ ప్రకటించింది. ► బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థలు సుమారు 10 శాతం కొలువులిచ్చాయట. కార్పొరేట్ ఫైనాన్స్, ట్రెజరీ, ప్రైవేట్– బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, మేనేజ్మెంట్, ఎఫ్ఎంసీజీ, రిటెయిల్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లోనూ 5 శాతం చొప్పున తమ విద్యార్థులు జాబ్స్ దక్కించుకున్నట్లు వెల్లడించింది. ఈ– కామర్స్ రంగంలో 8 శాతం మంది జాబ్స్ లభించినట్లు తెలిపింది. (క్లిక్: ఐఐటీ హైదరాబాద్ అద్భుత ఆవిష్కరణ..) -
మార్పుకు తగ్గట్టు.. ఉపాధి పెరిగేట్టు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ తర్వాత మారిన మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎంట్రపెన్యూర్ లిటరసీ అనే కొత్త కోర్సుతో పాటు, బిజినెస్ లిటరసీ, బిహేవియరల్ స్కిల్స్, డిజిటల్ లిటరసీ వంటి కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఔత్సాహికులు, విద్యార్థులకు ఈ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐఎస్బీ, తెలంగాణ సాంకేతిక విద్యామండలి మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం జరిగింది. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ల సమక్షంలో ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్న్పిల్లుట్ల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్‌లు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా నాలుగు కోర్సులను నిర్వహించనున్నారు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు ఐఎస్బీ, సాంకేతిక విద్యామండలి సంయుక్తంగా సర్టిఫికెట్లను జారీచేస్తాయి. ‘‘కేవలం 40 గంటల వ్యవధి గల ఈ కోర్సులను పూర్తిగా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. సొంతంగా సంస్థలను స్థాపించుకునే నైపుణ్యం ఈ కోర్సుల వల్ల వీలుపడుతుంది. కోర్సు పూర్తికాగానే సర్టిఫికెట్ జారీచేస్తాం. ఐఎస్బీ నిర్వహిస్తున్న కోర్సు కాబట్టి, మార్కెట్లో మంచి విలువ, డిమాండ్ ఉంటుంది. కంపెనీలు, పరిశ్రమల తక్షణ అవసరాలను తీర్చగల ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్ వంటి కోర్సులను డిజిటల్ లిటరసీ కోర్సు ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చాం.’’ అని నవీన్ మిట్టల్ అన్నారు. ఫిబ్రవరి నుంచి కోర్సులు ప్రారంభం వచ్చే ఫిబ్రవరి నుంచి ఇవి ప్రారంభమవుతాయి. తాజా ఎంఓయూ ద్వారా 50వేల నుంచి 2లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. కోర్సు మధ్యలో అసెస్మెంట్ ఉంటుంది. దాని ఆధారం గానే సర్టిఫికెట్లు జారీచేస్తాం. ఫీజులు సైతం తక్కువగానే ఉంటాయి. ఐఎస్బీకున్న బ్రాండ్‌ను బట్టి ఈ సర్టిఫికెట్లను ఉద్యోగావకాశాల కోసం వినియోగించుకోవచ్చు. – దీపామణి, డిప్యూటీ డీన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ -
Hyderabad: ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ విస్తరణ.. కొత్తగా మరో డెలివరీ సెంటర్
ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతుంది. మానవ వనరుల లభ్యత, ప్రభుత్వ విధానాలు, భౌగోళిక అనుకూలత కారణంగా ఐటీ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను క్రమంగా విస్తరించుకుంటూ పోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్‌లో పాగా వేసిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ) సంస్థ తాజాగా మరో ఆఫీస్‌ని ప్రారంభించింది. 3000ల మంది ఉద్యోగులు మాదాపూర్‌లో స్కైవ్యూ క్యాంపస్ భవనంలో 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాత సౌకర్యాలతో నూతన డెలివరీ సెంటర్‌ని మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కొత్త క్యాంపస్‌లో మూడు వేల మంది ఉద్యోగులు పని చేయనున్నారు. ఇక్కడి నుంచే డిజిటల్, డేటా, క్లౌడ్ సొల్యుషన్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు సేవలు అందివ్వనుంది ఎల్టీఐ సంస్థ. ఐఎస్బీతో ఒప్పందం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్‌తో ఎల్టీఐ ఒప్పందం చేసుకుంది. రాబోయే న్యూఎంటర్‌ప్రైజెస్‌లలో డిజిటల్ రెడీనెస్ యొక్క ప్రాముఖ్యతపై ఈ రెండు సంస్థలు కలిసి పని చేయనున్నాయి. హైదరాబాద్‌లో నూతన క్యాంపస్ ప్రారంభించినందుకు ఎల్‌టీఐని మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాల కారణంగా ప్రసిద్ధి చెందిన సంస్థలు హైదరాబాద్‌లో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని ఆయన అన్నారు. -
వారి వంచనే ముంచిందా..?
బనశంకరి: అనుమానాస్పదంగా మృతిచెందిన ప్రొఫెసర్ ఏకే రావు కేసులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఒక ముఠా చేసిన భారీ మోసమే ఆయన మృతికి కారణమని తెలుస్తోంది. దీనికి బలం చేకూరేలా ఏకే రావు చనిపోయే రోజు పోలీసుల విచారణ ఎదుర్కొన్నారని తేలింది. తెలుగు గాయని హరిణి తండ్రి, విశ్రాంత ప్రొఫెసర్ ఏకే రావు 23వ తేదీ బెంగళూర్‌లో యలహంక–రాజానుకుంటే రైల్వే పట్టాలపై శవమై కనిపించారు. చాకుతో గొంతు, ఎడమ చేతిని కోసిన గుర్తులు కనిపించాయి. ఇది హత్యేనని కుటుంబ సభ్యులు యశవంతపుర రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పదవీ విరమణ తరువాత లోన్ కన్సల్టెన్సీ.. రావు మృతి చెందక ముందు కర్ణాటక సుద్దగుంటెపాళ్య పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన ఇటీవల పదవీవిరమణ పొందారు. తరువాత బెంగళూర్‌లో లోన్ కన్సల్టెన్సీ ఏజెన్సీని తెరిచారు. ఈ సమయంలో రావుకు, ఎస్ వెంచర్స్ కేపిటల్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన డేనియల్ ఆర్మ్‌స్ట్రాంగ్, రాఘవన్, వివేకానంద అనే వ్యక్తులు పరిచయమయ్యారు. తాము భారీ ప్రాజెక్టులకు రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. దీంతో రావు తన లోన్ కన్సల్టెన్సీ ద్వారా రుణాలు అడిగిన అరుణాచలప్రదేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణి తారంగ, బెంగళూర్ పారిశ్రామిక వేత్త గిరీశ్‌లను వారి వద్దకు పంపారు. లోన్లు ఇస్తామని, అయితే 3 నెలల ఈఎంఐ ముందుగా చెల్లించాలని ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం చెప్పగా ఫణి తారంగ, గిరీశ్ సరేనన్నారు. రూ.240 కోట్ల లోన్‌కు ఫణి తారంగ రూ.3.60 కోట్లు, గిరీశ్ రూ.150 కోట్లకు రూ.3 కోట్లు ముందస్తుగా ఈఎంఐ చెల్లించారు. ఆ తరువాత ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం ఫోన్లు స్విచాఫ్ చేసుకుని పరారైంది. దీంతో ఫణి తారంగ, గిరీశ్‌లు రావును నిలదీయడంతో పాటు స్థానిక సుద్దగుంటపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రావును విచారణకు పిలిపించి పంపించినట్లు సమాచారం. ఫైనాన్షియర్లు నమ్మించి మోసం చేశారని రావు స్నేహితుల వద్ద వాపోయారు. అనంతరం కొద్దిసేపటికి ఏకే రావు రైల్వేట్రాక్‌పై శవమై కనిపించారు. ఈ నేపథ్యంలో ఆర్మ్‌స్ట్రాంగ్, వివేకానంద, రాఘవన్ కోసం సుద్దగుంటెపాళ్య పోలీసులు గాలిస్తున్నారు. -
దేశంలో నంబర్‌వన్ బీ–స్కూల్‌గా ‘ఐఎస్బీ’
రాయదుర్గం(హైదరాబాద్): ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) దేశంలోనే నంబర్‌వన్ బిజినెస్ స్కూల్‌గా మరోసారి గుర్తింపు సాధించింది. బ్లూమ్‌బెర్గ్ బిజినెస్ వీక్ ఉత్తమ బీ–స్కూల్స్– 2021 ర్యాంకింగ్స్‌ను బుధవారం ప్రకటించారు. ఈ ర్యాంకింగ్స్‌లో ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో 5వ స్థానంలో నిలిచింది. బిజినెస్ స్కూల్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్(పీజీపీ)లో ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. 2021–22 ర్యాంకింగ్స్‌ను ప్రకటించేందుకు బ్లూమ్‌బెర్గ్ బిజినెస్ వీక్ ప్రపంచవ్యాప్తంగా 119 బిజినెస్ స్కూల్స్‌ను సర్వే చేసింది. 6,640 మంది విద్యార్థులు, 12,462 మంది పూర్వ విద్యార్థులు, 853 మంది యజమానులను సర్వే చేసి ర్యాంకింగ్స్‌ను నిర్ధారించారు. బిజినెస్ స్కూల్స్‌లో నిర్వహణ, ఎడ్యుకేషన్–లెరి్నంగ్, నెట్ వర్కింగ్, ఎంట్రప్రెన్యూర్íÙప్ వంటి నాలుగు అంశాలను ఆధారంగా చేసుకుని ర్యాంకింగ్స్‌ను ఇచ్చారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఐఎస్బీ లెరి్నంగ్, నెట్ వర్కింగ్‌లో రెండోస్థానం, ఎంట్రప్రెన్యూర్íÙప్లో మూడో స్థానం, పరిహారంలో ఆరవ స్థానంలో నిలిచింది. సమష్టి కృషికి నిదర్శనం ఐఎస్బీ అత్యుత్తమ ర్యాంకింగ్ సాధనకు ఫ్యాకల్టీ, అధికారులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సమష్టిగా చేసిన కృషికి నిదర్శనం. ర్యాంకింగ్‌లు మెరుగుపడటంతో మరింత బాధ్యతగా చిత్తశుద్ధితో కృషి చేస్తాం. –ప్రొఫెసర్ మదన్పిల్లుట్ల– డీన్ ఐఎస్బీ -
హైదరాబాద్ ఐఎస్బీ.. మరో ఘనత
సాక్షి, హైదరాబాద్: ది ఫైనాన్షియల్ టైమ్స్–గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో 23వ స్థానం, ఆసియాలో ఐదో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. దేశంలోనే టాప్ 25లో స్థానం దక్కించుకున్న ఏకైక సంస్థ ఐఎస్బీ కావడం గమనార్హం. పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీ)లో ఈ ర్యాంకులు సాధించింది. ఈ ర్యాంకుల కోసం 2017కు చెందిన పీజీపీ విద్యార్థులను సర్వే చేశారు. ర్యాంకింగ్స్ కోసం ది ఫైనాన్షియల్ టైమ్స్ పరిగణనలోకి తీసుకున్న అనేక రంగాల్లో ఈ విద్యాసంస్థ మెరుగైన ప్రతిభ కనబర్చింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 28వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది తన ర్యాంకును మరింత మెరుగుపర్చుకుంది. సమష్టి కృషితోనే సాధ్యమైంది.. అత్యుత్తమ ప్రపంచస్థాయి విద్యను అందించడంలో ఐఎస్బీ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పర్చుకుంది. అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, సిబ్బంది, బోర్డు మద్దతు, సమష్టి కృషికి ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్ నిదర్శనం. నాణ్యమైన మేనేజ్మెంట్ విద్యకు దేశంలోనే కలికితురాయిగా ఐఎస్బీ నిలిచింది. – ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ, ఐఎస్బీ డీన్ చదవండి: శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా మాస్క్ తీసి ఫొటో దిగు నాయనా.. -
భారత్‌లో ఐఎస్బీ నంబర్–1
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మరో అరుదైన గుర్తింపు సాధించింది. ఫైనాన్షియల్ టైమ్స్–2020 సోమవారం ప్రకటించిన ఈఎంబీఏ ర్యాంకింగ్స్‌లో పీజీ పీమ్యాక్స్ కోర్సు నిర్వహణతో దేశంలోకే ఐఎస్బీ మొదటి స్థానం పొందగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 53వ స్థానం పొందింది. (క్యాబ్ చార్జీలు; డ్రైరన్ పేరిట బాదుడు) ఐఎస్బీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, వ్యాపార యజమానులకు కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్న 15 నెలల కాలపరిమితితో కూడిన గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ స్థాయి ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. 2017 పీజీ పీమ్యాక్స్ క్లాస్ నుంచి ఐఎస్బీ పూర్వ విద్యార్థులు ఈ ఏడాది ర్యాంకింగ్ కోసం సర్వే చేయబడ్డారు. ప్రధానంగా లక్ష్యాల సాధన, జీతాల పెంపుదల, ప్రస్తుత జీతాలు, కెరియర్ ప్రొగ్రామ్స్ నిర్వహణ, మహిళా ఫ్యాకల్టీ, విద్యార్థినులు, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, అంతర్జాతీయ విద్యార్థులు వంటి అంశాలపై పరిశీలించి ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంక్‌లను ప్రకటించింది. గతేడాది 52వ ర్యాంక్ పొందగా ఈ ఏడాది 53 వస్థానం పొందగలిగింది. తాజా ర్యాకింగ్స్ వల్ల ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రాముఖ్యతతో పాటు ఐఎస్బీ ప్రాధాన్యత పెరిగిందని డీన్ ప్రొఫెసర్ రాజేంద్రశ్రీవాత్సవ అన్నారు. -
ఒకే వారంలో అన్ని ఎన్నికలు నిర్వహిస్తే మంచిది
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పంచాయతీ నుంచి లోక్‌సభ వరకు ఒక వారం వ్యవధిలో ఎన్నికలు నిర్వహించేలా చూస్తే మంచిదని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఏడాదంతా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో వీటిపైనే పార్టీలు దృష్టి పెట్టడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించడం ద్వారా అక్రమ ధన ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీసుకునే చర్యలతోపాటు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. గురువారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంగణంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్, ఐఎస్‌బీల ఆధ్వర్యంలో ‘రాజకీయాల్లో ధనబలం’అంశంపై ఏర్పాటు చేసిన రెండ్రోజుల సదస్సును వెంకయ్య ప్రారంభించారు. నోటుతో.. ప్రశ్నించే గొంతు కోల్పోతాం ఓటుకు నోటు తీసుకుంటే ప్రశ్నించే గొంతును కోల్పోతామని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు బస్సు, బీరు, బిర్యానీ అనే త్రీ బీ సర్వసాధారణమై పోయాయని, వీటికి ప్రజలు దూరంగా ఉండాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌పై విశ్వవ్యాప్తంగా గౌరవం ఉందని.. అయితే.. ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యంగా మన దేశాన్ని తీర్చిదిద్దుకోవాలంటే ఎన్నికల్లో, ధన, అంగబలంపై నియంత్రణ అవసరమన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు, పార్టీల విధానాలపై సమీక్ష అవసరమన్నారు. ప్రజలు నిబద్ధత, సత్ప్రవర్తన, పనిచేయగలిగే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను చట్టసభలకు పంపడం వల్లే వారి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలన్నారు. కోటీశ్వరులే ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితులుంటే.. నిజంగా ప్రజాసేవ చేసే వారికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉండదన్నారు. ఆర్థికపరమైన అంశాల్లో పార్టీలు జవాబుదారీతనాన్ని అలవాటు చేసుకుని ప్రజల్లో విశ్వాసం చూరగొనాలని ఆయన సూచించారు. అందరికీ సమాన అవకాశాలు ఉండటం లేదు: జేపీ ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోవడం వల్ల ధనికులే పోటీ చేయగలుగుతున్నారని, పోటీకి అందరికీ సమాన అవకాశాలు ఉండటం లేదని ఎఫ్డీఆర్ ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ నారాయణ అన్నారు. ఎన్నికల్లో ధన బలాన్ని, ధన ప్రవాహాన్ని తగ్గించకపోతే అవినీతి, అక్రమాలు మరింతగా పెచ్చుమీరే అవకాశాలున్నాయన్నారు. దేశంలో ఎన్నికల ద్వారా శాంతియుతమైన పద్ధతుల్లో అధికార మార్పిడి జరుగుతున్నా ప్రజాస్వామ్యం పూరిస్థాయిలో పనిచేయడం లేదన్నారు. మరింత మెరుగైన పద్ధతుల్లో ప్రజలకు సేవలు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. -
మంచి జన్మించిన రోజు
ట్రినా దత్తా బెంగాలీ అమ్మాయి. కోల్‌కతాలో పుట్టింది. ఎం.బి.ఎ చదివింది. అది కూడా ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో. ఇప్పుడు నైజీరియాలో ఉద్యోగం చేస్తోంది. పుట్టిన రోజు సొంత నేల మీద చేసుకోవాలనుకుంది. మొన్న (జూన్ 9) ఆమె పుట్టిన రోజు . ముప్పయ్యవ పుట్టిన రోజు. అంతకు కొన్ని రోజుల ముందే.. కోల్‌కతాలో దిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కంటపడిన దృశ్యాలు ఆమెని ఆలోచనలో పడేశాయి. అవి అంతకుముందు కూడా చూసినవే. ఇప్పుడు బయట దేశాన్ని చూసి వచ్చిన తర్వాత అవే దృశ్యాలు తీవ్రమైన ఆవేదనకు గురిచే శాయి ఆమెను. ముప్పై మందికి కొత్త జీవితం పుట్టిన రోజులకు నగరంలో ఒకవైపు కేక్‌లు, పేస్ట్రీలు, స్నేహితులు, బంధువులతో విందుల్లో మునిగి తేలుతున్నారు. అదే నగరంలో మరోవైపు పెద్ద ఇళ్ల సందుల్లో చిన్న గుడారాల్లో అర్ధాకలితో అలమటించేవాళ్లూ ఉన్నారు. బిడ్డ ఆకలి తీర్చడానికి చెయ్యి చాచే తల్లులున్నారు. ఆ ఆడవాళ్లలో ఎక్కువ భాగం ట్రాఫికింగ్ బాధితులే. అవన్నీ చూసిన ట్రినాకు ఓ ఆలోచన వచ్చింది. తన ముప్పయ్యవ పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని. బంధువులు, స్నేహితులు ఖరీదైన బహుమతులతో తనను సర్ప్రైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తన పుట్టిన రోజు తనకు మాత్రమే కాదు, తన వాళ్లకు కూడా స్వీట్ మెమొరీగా ఉండాలి. ఖర్చు చేసే ప్రతి రూపాయి మరొకరి జీవితాన్ని బాగు చేయాలి... ఇదీ ఆమెకు వచ్చిన కొత్త ఆలోచన. ట్రాఫికింగ్ బారి నుంచి బయటపడిన మహిళల్లో ముప్పయ్ మందికి కొత్త జీవితాన్నివ్వడానికి తన వంతు సహకారం అందివ్వాలనుకుంది. ఒక్కొక్కరికి ఫీజు ఏడు వేలు అక్రమ రవాణా విషవలయం నుంచి బయటపడిన ఆడవాళ్లకు ఆశ్రయం కల్పించి వారికి ఉపాధి కల్పించే ఎన్‌జివోను సంప్రదించింది ట్రినా. ఐటి డిప్లమో కోర్సు చేయడానికి ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలవుతుంది. ముప్పయ్ మందికి కోర్సు ఫీజు రెండు లక్షల పది వేల రూపాయలు. ట్రినా తన ఆలోచన ఇంట్లో చెప్పింది. ఫ్రెండ్స్ కూడా సంతోషంగా ముందుకొచ్చారు. తనకు గిఫ్ట్ కోసం ఇవ్వాలనుకున్న డబ్బును జమ చేయమంది. అందరూ ఇచ్చినంత ఇవ్వగా మిగిలిన డబ్బు తాను ఇవ్వాలనేది ట్రినా ఆలోచన. అయితే ట్రినా రూపాయి తీయాల్సిన పని లేకుండా అంతకు మించిన డబ్బు పోగయింది. మొత్తం రెండు లక్షల పాతిక వేల ఆరు వందల ఇరవై రెండు రూపాయలు. ‘ఒక బహుమతి మరొకరి జీవితాన్ని బాగు చేస్తుందంటే అంతకంటే సంతోషం మరోటి ఏముంటుంది’ అంటూ ట్రినా ఆలోచనను అభినందించారంతా. పాత ఆలోచనే.. కొత్తగా! ‘‘మా అమ్మ, ఆంటీలు చాలాసార్లు మా పుట్టిన రోజుకు వీధి పిల్లలకు స్వీట్లు ఇవ్వడం వంటివి చేసేవారు. ఆపన్నుల అవసరాలకు స్పందించేవారు. ఇప్పుడు నేను చేసిన ఆలోచన కొత్తదేమీ కాదు. కొద్దిగా మార్చుకున్నానంతే. సహాయం అందుకున్న వాళ్లంతా మనసారా విషెష్ చెప్పారు. నాకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్లు కూడా తమకు ఒక మంచి పని చేసే అవకాశం ఇచ్చావంటూ నన్ను అభినందించారు. నా ముప్పయ్యవ పుట్టినరోజు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఇండియాకి వచ్చాను. ఇంతకంటే గొప్ప సెలబ్రేషన్ ఇంకేముంటుంది’’ అంటోంది ట్రినా. – మంజీర -
ఆ విద్యార్థులకు సగటు వేతనం రూ.22లక్షలు
న్యూఢిల్లీ : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) హైదరాబాద్ తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ ఇన్ మేనేజ్ మెంట్ విద్యార్థుల ఫైనల్ ప్లేస్ మెంట్లను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ఏడాది క్యాంపస్ రిక్రూటర్లను ఈ బీస్కూల్ 38 శాతం పెంచింది. దీనిలో భాగంగా మొత్తం 1,113 జాబ్ ఆఫర్స్ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. సగటు వేతనం కింద రిక్రూటర్లు రూ.22 లక్షలను ఆఫర్ చేసినట్టు ఐఎస్బీ పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రైవేట్ రంగంలోనూ లీడర్ షిప్ పొజిషన్లకు విద్యార్థులు రిక్రూట్ అయినట్టు తెలిపింది. ఐఎస్బీ రిక్రూట్ మెంట్ సంస్థల్లో ఐటీ రంగ కంపెనీలే తొలిస్థానంలో నిలిచాయి. ప్రస్తుతం ఐటీ రంగం అనిశ్చితి పరిస్థితుల్లో కొనసాగుతున్నప్పటికీ, ఐఎస్బీ విద్యార్థులకు ఐటీ/ఐటీఈఎస్ రంగాలు మొత్తం ఆఫర్లలో 20 శాతం, 21 శాతం ఆఫర్లను ప్రకటించాయి. వీటి తర్వాత బీఎఫ్ఎస్ఐ, హెల్త్ కేర్, ఫార్మా రంగాలు నిలిచినట్టు ఐఎస్బీ పేర్కొంది. 400కు పైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ క్యాంపస్ ఆఫర్లలో పాల్గొన్నాయి. టాప్ రిక్రూటర్లుగా మెక్కిన్సీ అండ్ కంపెనీ, బీఎస్జీ, ఆపిల్, మైక్రోసాఫ్ట్, సిటీ బ్యాంకు, నోవర్టీస్, అమెజాన్, కాగ్నిజెంట్, హిందూస్తాన్ యూనీలివర్ లిమిటెడ్, జోన్స్ లాంగ్ లాసాల్లె, హవెల్స్, రెవిగో, పీ అండ్ జీ, లెండింగ్ కార్ట్, రిలయన్స్ జియో, మైండ్ ట్రీ కన్సల్టింగ్, రోనాల్డ్ బెర్జర్ లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఏడాది పబ్లిక్ అడ్వకసీ, స్ట్రాటజీ పోస్టులకు 21 జాబ్ ఆఫర్లను ఈ గ్రాడ్యుయేట్లకు ఆఫర్ చేసింది. ఆదిత్యా బిర్లా గ్రూప్, సిటీ బ్యాంకు, యస్ బ్యాంకు, ఫిల్లిప్స్ ఇండియా లిమిటెడ్, టెక్ మహింద్రా, మ్యాక్స్, గెన్ ప్యాక్ట్ సంస్థలు లీడర్ షిప్ పొజిషన్లనే ఐఎస్బీ గ్రాడ్యుయేట్లకు ఆఫర్ చేశాయి. యాక్సిస్ బ్యాంకు, అశోక్ లేల్యాండ్ లు మహిళా గ్రాడ్యుయేట్లను తమ లీడర్ షిప్ పొజిషన్లకు ఎంపికచేసినట్టు ఐఎస్బీ చెప్పింది. కార్గిల్, ఆపిల్, ల్యాండ్ మార్క్ గ్రూప్, బేకరెంట్, క్రెడిట్ యాక్సిస్ ఆసియా వంటి అంతర్జాతీయ సంస్థలు తొలిసారి ఐఎస్బీ విద్యార్థులను తమ కంపెనీల్లో రిక్రూట్ చేసుకున్నట్టు ఐఎస్బీ హైదరాబాద్ పేర్కొంది. -
ఐటీ బూమ్ మరో 30 ఏళ్లు
ఇన్ఫోసిస్ క్రిస్ గోపాలకృష్ణన్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వృత్తిపరంగా సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా కంపెనీతో తనకు మానసిక అనుబంధం ఉందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో క్రిస్ గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీవిత కాలాన్ని పణంగాపెట్టి నిర్మించిన సంస్థ నుంచి మానసికంగా బయటకు రాలేమని అన్నారు. అయితే అన్నిటికీ సిద్ధంగా ఉండాలని, తాము రెండో ఇన్నింగ్స్ ప్రారంభించామని గుర్తుచేశారు. కంపెనీతో మానసిక బంధం ఎన్నటికీ తెగదని చెప్పారు. కాగా, భారత్‌లో ఐటీ బూమ్ మరో 30 ఏళ్లు ఉంటుందని క్రిస్ తెలిపారు. ‘ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ రంగంలో ప్రవేశించేందుకు సరైన తరుణమిదే. హెల్త్‌కేర్, ఆటోమొబైల్ వంటి రంగాలు వచ్చే మూడు దశాబ్దాలు మరింత ఉత్తేజకరంగా ఉంటాయి. ప్రతి పరిశ్రమతోపాటు మన జీవితంలో అన్నింటికీ ఐటీని వినియోగిస్తుండడం ఈ బూమ్కి కారణం. సమూల మార్పులకు వాహన రంగం వేదిక కానుంది. స్వయం చోదక కార్లు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించే వాహనాల వంటి ఎన్నో ఆవిష్కరణలు నమోదుకానున్నాయి’ అని తెలిపారు. -
నిఫ్ట్ సలహా కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్రస్థాయి సలహా కమిటీని నియమించింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఆర్థిక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులు, సంబంధిత పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రతినిధులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. -
తయారీ రంగంపై ఏడాది కోర్సు: ఐఎస్బీ
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) కొత్త కోర్సును ప్రారంభిస్తోంది. తయారీ, వ్యాపార వ్యవహారాల నిర్వహణపై ఒక ఏడాది కాల పరిమితి గల ప్రోగ్రామ్‌ను మే నుంచి మొదలు పెడుతోంది. తయారీ రంగంలో అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలు తెలుసుకునేందుకు వృత్తి నిపుణులకు దోహదం చేస్తుందని ఐఎస్బీ డిప్యూటీ డీన్ ప్రదీప్ సింగ్ తెలిపారు. -
ఐఎస్బీ-ఐఐసీఏ సంయుక్త కోర్సు
సీఎస్ఆర్ మేనేజ్మెంట్పై స్వల్పకాలిక కోర్సు నిర్వహణ కోసం న్యూఢిల్లీలో బుధవారం ఐఐసీఏ డెరైక్టర్ జనరల్, సీఈఓ డాక్టర్ భాస్కర్ చటర్జీ, ఐఎ్స్బీ డిప్యూటీ డీన్ ప్రదీప్‌సింగ్ ఒప్పందంపై సంతకాలు చేసినప్పటి దృశ్యం హైదరాబాద్: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్(ఐఐసీఏ) సంయుక్తంగా కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) మేనేజ్మెంట్ అంశంపై స్వల్పకాలిక కోర్సుకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు రెండు సంస్థల ప్రతినిధులు బుధవారం న్యూఢిల్లీలో ఒక ఒప్పందంపై సంతకాలు చేశారని ఐఎస్బీ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ సి.చిట్టిపంతులు తెలిపారు. ఐఐసీఏ డెరైక్టర్ జనరల్, సీఈఓ డాక్టర్ భాస్కర్ చటర్జీ, ఐఎ్స్బీ డిప్యూటీ డీన్ ప్రదీప్‌సింగ్ ఒప్పందంపై సంతకాలు చేశారని పేర్కొన్నారు. కార్పొరేట్ యాక్ట్ 2013 ప్రకారం దేశంలోని కంపెనీలన్నీ తమ ఆదాయంలో రెండు శాతం నిధులను సీఎస్ఆర్ కార్యక్రమాల క్రింద వ్యయం చేయాలని స్పష్టం చేశారు. దీంతో దేశంలోని 16వేల కంపెనీలు ఈ సీఎస్ఆర్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ప్రతి యేటా నిర్వహించేం దుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐసీఏ ద్వారా ఇప్పటికే తొమ్మిది నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోర్సును అక్టోబర్ 2014లో ఒక కోర్సును ప్రారంభించి నిర్వహిస్తున్నారు. 16 వారాల కాలపరిమితితో కూడిన నూతన కోర్సును జూన్, 2015 నుంచి ప్రారంభించాలని నిర్ణయించాయి. ఐఎస్బీ మెహలి, హైదరాబాద్‌లలో సంయుక్తంగా ఈ కోర్సును నిర్వహిస్తాయి. ఈ కోర్సులో 35 నుంచి 40 మంది చేరడానికి అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన అఫీషియల్స్, ఎగ్జిక్యూటివ్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లలో ఆరు నుంచి ఏడు ఏళ్ళు పనిచేసిన అనుభవం ఉన్నవారికి ఈ కోర్సులో చేరడానికి అవకాశం కల్పిస్తారు. ఈ కోర్సు తరగతులను హైబ్రీడ్ కంబైనింగ్ క్లాస్ రూమ్స్, ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా నిర్వహిస్తారు. మూడు వారాల పాటు క్యాంపస్ కాంటాక్ట్ క్లాసులను మిగతావాటిని ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఐఎస్బీ పూర్వవిద్యార్థుల బృందానికి అమెరికన్ ప్రైజ్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కు చెందిన ఐదుగురు పూర్వ విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన అమెరికన్ హల్ట్ ప్రైజ్ అందుకున్నారు. దీంతో పాటు క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్(సీజీఐ) సంస్థ ద్వారా ఒక మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని పొందారు. మంగళవారం రాత్రి అమెరికాలోని న్యూయార్క్ సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకులు మహ్మద్ యూనుస్ కలసి ఐఎస్బీ పూర్వ విద్యార్థులకు ఈ ప్రైజ్‌ను అందజేశారు. ఐఎస్బీ పూర్వ విద్యార్థులు అదితి వైష్, ఆశిష్ బోండియా, మనీష్ రంజన్, ప్రణవ్ కుమార్, మారగంటి రామనాథన్ లక్ష్మణన్ బృందం ‘నానో హెల్త్’ పేరిట రూపొందించిన కార్యక్రమానికి ఈ ప్రైజ్ లభించింది. హల్ట్ ప్రైజ్‌ను సామాజిక దృక్పథంతో ప్రపంచంలో అత్యధిక మందిని భాగస్వాములను చేసే వ్యాపారాన్ని రూపొందించే విద్యార్థులకు అందజేస్తారు. -
ఐఎస్బీలో ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ల్యాబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంపన్న, వర్ధమాన దేశాల్లో ఇన్వెస్టింగ్ తీరుతెన్నుల గురించి అవగాహన పెంచే దిశగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) చేతులు కలిపింది. హైదరాబాద్‌లోని ఐఎస్బీ క్యాంపస్‌లో ట్రేడింగ్ లేబొరేటరీని ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఈ ఎండీ చిత్రా రామకృష్ణ బుధవారం ఇక్కడ దీన్ని ప్రారంభించారు. అంతర్జాతీయంగా మారుతున్న ట్రేడింగ్ తీరుతెన్నులు, సంపన్న దేశాల్లో పాటిస్తున్న విధానాలు, వర్ధమాన దేశాల్లో విధానాలు మొదలైన వాటిని అధ్యయనం చేసేందుకు ఈ ల్యాబ్ ఉపయోగపడగలదని ఈ సందర్భంగా చిత్రా తెలిపారు. బిజినెస్ స్కూల్స్‌తో ఎన్ఎస్ఈ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే ప్రథమం అని ఆమె చెప్పారు. కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా విద్యార్థులు ఎప్పటికప్పుడు ప్రపంచ మార్కెట్ల పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ ల్యాబ్‌లో 34 ట్రేడింగ్ టెర్మినల్స్ ఉన్నాయని ఐఎస్బీ డీన్ అజిత్ రంగ్నేకర్ తెలిపారు. బ్లూమ్‌బర్గ్, థామ్సన్ రాయిటర్స్ వంటి ప్రీమియం బిజినెస్ సంస్థల డేటాబేస్లు కూడా వారికి అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకునేందుకు ఈ ల్యాబ్ తోడ్పడగలదని రంగ్నేకర్ వివరించారు. -
కార్పొరేట్ రంగంలో మగువల హవా!
న్యూఢిల్లీ: ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటున్న మహిళలు కార్పొరేట్ రంగంలో కూడా దూసుకుపోతారని యాక్సెంచర్ తాజా నివేదిక అంటోంది. 2020 కల్లా అగ్రశ్రేణి మేనేజ్మెంట్ స్థాయిల్లోనూ, కంపెనీల డెరైక్టర్ల బోర్డ్ల్లోనూ మహిళల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని కన్సల్టింగ్, టెక్నాలజీ కంపెనీ యాక్సెంచర్ నివేదిక వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో ఆన్లైన్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ కంపెనీ ఈ నివేదికను రూపొందించింది. 32 దేశాలకు చెందిన మధ్య, భారీ స్థాయి సంస్థలకు చెందిన 4,100 మంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాల్గొన్నారు. కంపెనీల్లో మహిళల పురోగతి విషయమై, ఉద్యోగుల్లోనూ, కంపెనీల్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో ఆశాభావం వెల్లడైందని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యాంశాలు.. {పస్తుతం భారత కంపెనీల్లో సీఈవోలు, ఎగ్జిక్యూటివ్‌లు, ఇతర ఉన్నత స్థాయిల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ఆరేళ్లలో ఈ సంఖ్య పెరగగలదన్న విశ్వాసాన్ని ఈ సర్వేలో పాల్గొన్న భారతీయులు వ్యక్తం చేశారు. కంపెనీల డెరైక్టర్లుగా మహిళల సంఖ్య 2020కల్లా పెరుగుతుందని 71% మంది అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారి సంఖ్య 40%. 2020 కల్లా మహిళా సీఈవోల సంఖ్య పెరుగుతుందని 70% మంది పేర్కొన్నారు. భారత్ విషయానికొస్తే, ఇలా చెప్పిన వారి సంఖ్య 44%, అమెరికాలో 66%గా, ఇంగ్లండ్‌లో 49 శాతంగా ఉంది. గతేడాదితో పోల్చితే మరింత ఉన్నత స్థాయిల్లోకి మహిళా ఉద్యోగులను ప్రమోట్ చేయాలని యోచిస్తున్నామని 44% కంపెనీలు చెప్పాయి. కాగా కంపెనీల ఉన్నత స్థాయిల్లో మహిళల సంఖ్యలో 2020కల్లా ఎలాంటి మార్పు ఉండదని జపాన్ దేశస్థులు భావిస్తున్నారు.