ఐటీ బూమ్‌ మరో 30 ఏళ్లు | IT Boom is another 30 years | Sakshi
Sakshi News home page

ఐటీ బూమ్‌ మరో 30 ఏళ్లు

Published Sat, May 6 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

ఐటీ బూమ్‌ మరో 30 ఏళ్లు

ఐటీ బూమ్‌ మరో 30 ఏళ్లు

ఇన్ఫోసిస్‌ క్రిస్‌ గోపాలకృష్ణన్‌ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వృత్తిపరంగా సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా కంపెనీతో తనకు మానసిక అనుబంధం ఉందని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో క్రిస్‌ గోపాలకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీవిత కాలాన్ని పణంగాపెట్టి నిర్మించిన సంస్థ నుంచి మానసికంగా బయటకు రాలేమని అన్నారు. అయితే అన్నిటికీ సిద్ధంగా ఉండాలని, తాము రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించామని గుర్తుచేశారు. కంపెనీతో మానసిక బంధం ఎన్నటికీ తెగదని చెప్పారు.

కాగా, భారత్‌లో ఐటీ బూమ్‌ మరో 30 ఏళ్లు ఉంటుందని క్రిస్‌ తెలిపారు. ‘ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ రంగంలో ప్రవేశించేందుకు సరైన తరుణమిదే. హెల్త్‌కేర్, ఆటోమొబైల్‌ వంటి రంగాలు వచ్చే మూడు దశాబ్దాలు మరింత ఉత్తేజకరంగా ఉంటాయి. ప్రతి పరిశ్రమతోపాటు మన జీవితంలో అన్నింటికీ ఐటీని వినియోగిస్తుండడం ఈ బూమ్‌కి కారణం. సమూల మార్పులకు వాహన రంగం వేదిక కానుంది. స్వయం చోదక కార్లు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించే వాహనాల వంటి ఎన్నో ఆవిష్కరణలు నమోదుకానున్నాయి’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement