సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న రాష్ట్రానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవంలో పాల్గొంటారు. 20 రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ ముఖ్యనేతల రాకతో రాష్ట్ర బీజేపీలో కొత్త జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నేతలతో చర్చలు జరుపుతున్నారు.
బేగంపేట్ ఎయిర్ పోర్టులో పార్టీ నేతలను ప్రధాని కలిసేలా కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్ నేతలతోనూ ప్రధాని భేటీ అయ్యేలా కార్యక్రమాలకు తుదిరూపు ఇస్తున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి ఇప్పటికే సమాచారం పంపారు. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే సందేశాన్ని మోదీ పర్యటన ద్వారా ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా కార్యక్రమాల నిర్వహణకు సంజయ్ కార్యచరణ రూపొందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రాజ‍్యసభ ఎన్నికలు: టీఆర్‌ఎస్ అభ‍్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment