హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)కు చెందిన ఐదుగురు పూర్వ విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన అమెరికన్ హల్ట్ ప్రైజ్ అందుకున్నారు. దీంతో పాటు క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్(సీజీఐ) సంస్థ ద్వారా ఒక మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని పొందారు. మంగళవారం రాత్రి అమెరికాలోని న్యూయార్క్ సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకులు మహ్మద్ యూనుస్ కలసి ఐఎస్‌బీ పూర్వ విద్యార్థులకు ఈ ప్రైజ్‌ను అందజేశారు.
ఐఎస్‌బీ పూర్వ విద్యార్థులు అదితి వైష్, ఆశిష్ బోండియా, మనీష్ రంజన్, ప్రణవ్ కుమార్, మారగంటి రామనాథన్ లక్ష్మణన్ బృందం ‘నానో హెల్త్’ పేరిట రూపొందించిన కార్యక్రమానికి ఈ ప్రైజ్ లభించింది. హల్ట్ ప్రైజ్‌ను సామాజిక దృక్పథంతో ప్రపంచంలో అత్యధిక మందిని భాగస్వాములను చేసే వ్యాపారాన్ని రూపొందించే విద్యార్థులకు అందజేస్తారు.
ఐఎస్‌బీ పూర్వవిద్యార్థుల బృందానికి అమెరికన్ ప్రైజ్
Published Thu, Sep 25 2014 3:07 AM | Last Updated on Thu, Apr 4 2019 3:48 PM
Advertisement