బీమా ధీమా.. అరటికి డుమ్మా
Published Fri, Nov 4 2016 2:30 AM | Last Updated on Mon, Sep 17 2018 7:44 PM
జంగారెడ్డిగూడెం : పంటల బీమా పథకంలో అరటి, నిమ్మ, జీడిమామిడి రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. 2016–17 రబీ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మామిడి, అరటి, జీడిమామిడి, నిమ్మ, టమాటా పంటలకు బీమా వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, మన జిల్లాకు వచ్చేసరికి
కేవలం వరి, మామిడి పంటలకు మాత్రమే బీమా సదుపాయం కల్పించారు. జిల్లాలో ఉద్యాన పంటలైన మామిడితోపాటు అరటి, నిమ్మ, జీడిమామిడి పంటలు కూడా సాగవుతున్నాయి. అయితే, వరి, మామిడి మినహా ఇతర పంటలకు బీమా పథకాన్ని వర్తింప చేయడం లేదు. జిల్లాలో 14,273 హెక్టార్లలో అరటి, 4,029 హెక్టార్లలో నిమ్మ, 15,016 హెక్టార్లలో జీడిమామిడి పంటలు సాగువుతున్నాయి. వీటికి బీమా పథకం వర్తించకపోవడంతో ఆ రైతులు నిరాశకు గురవుతున్నారు.
గ్రామం యూనిట్‌గా వరికి..
జిల్లాలో వరి పంటకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయనున్నారు. రబీ సీజ¯ŒSలో సుమారు 2.50 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. ఎకరానికి రూ.530 చొప్పున బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు నేరుగా బీమా పథకం అమలవుతుంది. పంట రుణం నుంచే బీమా ప్రీమియం మినహాయించుకుంటారు. రుణాలు తీసుకోని రైతులు మాత్రం వ్యవసాయ శాఖ ద్వారా ప్రీమియం చెల్లించాలి. మామిడి పంట విషయానికి వస్తే 5 నుంచి 15 సంవత్సరాల వయసు చెట్టుకు రూ.450, 16 నుంచి 50 సంవత్సరాల చెట్టుకు రూ.800 చొప్పున ఒక హెక్టార్‌లో 100 చెట్ల వరకు బీమా వర్తిస్తుంది. మామిడి రైతులకు మొత్తంగా రూ.1.50 లక్షల వరకు బీమా క్లెయిమ్ వర్తిస్తుంది. ఇందులో 28 శాతం అంటే రూ.42 వేలు ప్రీమియంగా చెల్లించాల్సి ఉండగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.17,250, కేంద్ర ప్రభుత్వం రూ.17,250 చెల్లిస్తాయి, రైతు తన వంతుగా రూ.7,500 చెల్లిస్తే సరిపోతుంది. అధిక లేదా అసాధారణ వర్షపాతం నమోదైనా, వ్యాధులు, వాతావరణ మార్పులు, అధిక గాలులు వల్ల పంటకు నష్టం సంభవించినా బీమా వర్తిసుంది. అది కూడా డిసెంబర్ 15, 2016 నుంచి మే 31, 2017 కాలానికి మాత్రమే వర్తిస్తుంది.
రెండు క్లస్టర్లుగా విభజన
ఫసల్ బీమా యోజన అమలుకు రాష్ట్రంలోని 13 జిల్లాలను రెండు క్లస్టర్లుగా విభజించారు. మొదటి క్లస్టర్‌లో విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, గుంటూ రు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం ఉన్నాయి. ఈ క్లస్టర్‌కు అగ్రికల్చర్ ఇన్సూరె¯Œ్స కంపెనీ ఆఫ్ ఇండియా ఏజెంట్‌గా వ్యవహరిస్తుంది. రెండో క్లస్టర్‌లో శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలు ఉండగా, వీటికి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరె¯Œ్స కంపెనీ ఏజెంట్‌గా వ్యహరిస్తుంది.
Advertisement
Advertisement