పాత ప్రాజెక్టులకే ప్రధాని నరేంద్రమోదీతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపనలు చేయిస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
-
ప్రధానిని అగౌరవ పర్చడమే
-
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
మంకమ్మతోట : పాత ప్రాజెక్టులకే ప్రధాని నరేంద్రమోదీతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపనలు చేయిస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు నీరివ్వకుండా గజ్వేల్‌కు తీసుకుపోతున్నారని విమర్శించారు. ఇప్పటికే సుజల స్రవంతి ద్వారా హైదరబాద్‌కు నీరు తీసుకెళ్తున్నారని..అక్కడి నుంచి మిషన్ భగీరథ ద్వారా గజ్వేల్‌కు తరలించేందుకే ప్రధానితో శంకుస్థాపనలు చేయిండం ఆయన్ని అవమానించడమేనన్నారు. 2005లో యూపీఏ ప్రభుత్వం మనోహరాబాద్‌కు రైలుమార్గాన్ని శంకుస్థాపన చేసిందని, మళ్లీ ప్రధానితో చేయించడం బాధాకరమన్నారు. హెల్త్ మిషన్‌కు నిధులు లేక ప్రజలకు వైద్యసేవలు అందడం లేదన్నారు. కరీంనగర్ నుంచి తిరుపతి రైలును పూర్తిస్థాయిలో ప్రతీరోజు నడపాలని కోరారు. కాంగ్రెస్ లీగల్‌సెల్ జిల్లా చైర్మన్ వొంటెల రత్నాకర్, ఆకుల ప్రకాశ్, వీరారెడ్డి పాల్గొన్నారు.