ponnam
-
రేపటి నుంచి రైతు రుణ మాఫీ -మంత్రి పొన్నం
-
నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. స్లో పాయిజన్ ఇచ్చాడు: నటుడు
తమిళ నటుడు పొన్నంబలం ఇండస్ట్రీలో స్టంట్ మ్యాన్‌గా, విలన్‌గా గుర్తింపు పొందాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో విలన్‌గా నటించిన ఆయన సౌత్ ఇండస్ట్రీల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో చిరంజీవి ఘరానా మొగుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించాడు. 80,90లో ప్రతికథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయన అనంతరం సినిమాలకు దూరమయ్యాడు. చదవండి: చిరంజీవి వల్లే బతికాను, ఏదో చిన్న సాయం చేస్తారనుకుంటే..: నటుడు ప్రస్తుతం ఆడపదడపా సినిమాలు చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన గతేడాది తీవ్ర అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరాడు. సర్జరీ అనంతరం కోలుకున్న పొన్నంబలం ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సొంతవాళ్లే తనని చంపాలని చూశారంటూ షాకింగ్ విషయం బయటపెట్టారు. ‘నేను అతిగా తాగడం వల్లే నా కిడ్నీలు పాడయ్యాయని అందరు అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. నా తమ్ముడే నాకు స్లో పాయిజన్ ఇచ్చి నన్ను చంపాలని చూశాడు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: హైదరాబాద్ చేరుకున్న తారక్.. ఎయిర్‌పోర్టులో ఫ్యాన్స్ హంగామా చూశారా? ‘మా నాన్నకు నలుగురు భార్యలు. మూడో భార్య కొడుకు నా మేనేజర్‌గా పని చేసేవాడు. నా ఎదుగుదలను తట్టుకోలేక నా ఆహారంలో, డ్రింక్స్‌లో స్లో పాయిజన్ కలిపాడు. ఆ విషయాన్ని వైద్యులు గుర్తించారు. అది తెలియక నేను వాడిని చాలా నమ్మాను. నేను వాడి బాగు కోరుకుని ఉద్యోగం ఇస్తే. నా ఎదుగుదల చూసి ఓర్వలేక నన్ను చంపాలని చూశాడు. అంతేకాదు నా మీద చేతబడి కూడా చేయించాడు. ఆ విషయం నాకు ఇటీవలే తెలిసింది’ అంటూ అని చెప్పుకొచ్చాడు. -
కాంగ్రెస్‌ను వీడేదిలేదు : పొన్నం
కరీంనగర్ : కాంగ్రెస్‌ను వీడి తాను టీఆర్ఎస్లో చేరుతాననే ప్రచారం అబద్దమని, ఇందులో ఎంతమాత్రమూ నిజం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తాను క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తనని స్పష్టం చేశారు. ఓ పత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన పొన్నం మాట్లాడుతూ.. పదవి ఉన్నా.. లేకున్నా.. కాంగ్రెస్ జెండా మోస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నానని తెలిపారు. తాను ఎవరితో చర్చలు జరుపలేదని, తనను టీఆర్ఎస్ నేతలు ఎవరూ పార్టీలోకి రావాలని అడుగలేదని, అడిగినా వెళ్లేది లేదని స్పష్టం చేశారు. కొంత మంది పనికట్టుకుని కావాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మరోసారి ఇలాంటి వార్తలు రాసే ముందు తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. -
పాత ప్రాజెక్టులకే శంకుస్థాపనలు
ప్రధానిని అగౌరవ పర్చడమే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంకమ్మతోట : పాత ప్రాజెక్టులకే ప్రధాని నరేంద్రమోదీతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపనలు చేయిస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు నీరివ్వకుండా గజ్వేల్‌కు తీసుకుపోతున్నారని విమర్శించారు. ఇప్పటికే సుజల స్రవంతి ద్వారా హైదరబాద్‌కు నీరు తీసుకెళ్తున్నారని..అక్కడి నుంచి మిషన్ భగీరథ ద్వారా గజ్వేల్‌కు తరలించేందుకే ప్రధానితో శంకుస్థాపనలు చేయిండం ఆయన్ని అవమానించడమేనన్నారు. 2005లో యూపీఏ ప్రభుత్వం మనోహరాబాద్‌కు రైలుమార్గాన్ని శంకుస్థాపన చేసిందని, మళ్లీ ప్రధానితో చేయించడం బాధాకరమన్నారు. హెల్త్ మిషన్‌కు నిధులు లేక ప్రజలకు వైద్యసేవలు అందడం లేదన్నారు. కరీంనగర్ నుంచి తిరుపతి రైలును పూర్తిస్థాయిలో ప్రతీరోజు నడపాలని కోరారు. కాంగ్రెస్ లీగల్‌సెల్ జిల్లా చైర్మన్ వొంటెల రత్నాకర్, ఆకుల ప్రకాశ్, వీరారెడ్డి పాల్గొన్నారు. -
'నవ తెలంగాణ ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యం'