ప్రధానికి పాతనోట్లు.. విజిలెన్స్‌ అవాక్కు! | Banned Notes for PM Fund From Unknown Donor | Sakshi
Sakshi News home page

ప్రధానికి పాతనోట్లు.. విజిలెన్స్‌ అవాక్కు!

Published Sun, Jan 29 2017 4:07 PM | Last Updated on Mon, Sep 17 2018 7:44 PM

Banned Notes for PM Fund From Unknown Donor

న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లు అనూహ్యంగా దర్శనమిచ్చి ఢిల్లీ నిఘా విభాగాన్ని తీవ్ర ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓ మెడికల్‌ కాలేజీ డీన్‌కు వాటిని ప్రధాని ఫండ్‌ కింద జమచేయండంటూ పంపించాడు. రెండు కవర్లలో రద్దయిన పెద్ద నోట్లు రూ.23,500 పెట్టి వాటిపై 'ఇవి ప్రధానమంత్రి నేషనల్‌ రిలీఫ్‌ఫండ్‌కు పంపించండి' అని పేర్కొంటూ మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీ డీన్‌ దీపక్‌ కే తాంపేకు పంపించాడు.

ఆ పంపిన వ్యక్తి వివరాలు లేవు. దీంతో డీన్‌ తాంపే ఆ ప్యాకెట్‌ను ఢిల్లీ నిఘా విభాగానికి పంపించాడు. వాటిని తీసుకున్న నిఘా విభాగం తీవ్ర ఆలోచనలో పడింది. అతడు ఎందుకు ఇలా చేసి ఉంటాడా అని తెగ మదనపడిపోతున్నారు. బహుశా పాత నోట్లను మార్పిడి చేయలేకే అతడు ప్రధాని ఫండ్‌కు పంపించి ఉంటాడని భావిస్తున్నారు. ఆ అజ్ఞాత వ్యక్తిని గుర్తించేందుకు విచారణ ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement