banned notes
-
రూ.950 కోట్ల రద్దైన నోట్లు, వెనక్కి తీసుకోరా..
కాఠ్మాండు : రద్దయిన పెద్ద నోట్లు నేపాల్‌లో ఇంకా భారీగా ఉన్నట్టు తెలిసింది. ఈ వారంలో భారత్‌లో పర్యటించనున్న నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, తమ వద్దనున్న లక్షల కొద్దీ రద్దయిన భారత నోట్ల ఎక్స్చేంజ్ విషయంలో మన దేశ అధికారులతో చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2016లో పెద్ద నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించిన తర్వాత, నేపాల్ ప్రజల వద్ద, అధికారిక రంగాల్లో సుమారు రూ.950 కోట్ల రద్దయిన భారత బ్యాంకు నోట్లు ఉన్నట్టు అంచనాలు వెలువడ్డాయి. ఈ నోట్లను ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలనే విషయంలో నేపాల్, భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో నేపాల్ ప్రజల వద్ద భారీగా రద్దయిన పెద్ద నోట్లు ఉన్నట్టు తెలిసింది. అవినీతికి వ్యతిరేకంగా, నకిలీ కరెన్సీ నోట్లకు, ఉగ్రవాదానికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఈ డిమానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే భారత్ కరెన్సీని ఎక్కువగా వాడుతున్న నేపాల్, భూటాన్ దేశాలు ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది. భారత డిమానిటైజేషన్ నిర్ణయం నేపాలీ దేశస్తులను తీవ్రంగా బాధించిందని, ఇప్పటికే పలుమార్లు భారతీయ నేతలతో ఈ విషయంపై చర్చించామని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరామని పీఎం ఓలీ నేపాల్ పార్లమెంట్‌కు తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభం కాబోయే భారత పర్యటనలో నేపాల్ ప్రధాని ఓలీ, మన ప్రధాని నరేంద్రమోదీని, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను, ఇతర అధికారులను కలువనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల భాగస్వామ్య చర్చల్లో భాగంగా రద్దయిన నోట్ల విషయం గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. నోట్ల ఎక్స్చేంజ్ చేసుకుంటామని ఆర్బీఐ మాటిచ్చినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక చర్చలు జరుగలేదని సెంట్రల్ నేపాల్ రాష్ట్ర బ్యాంకు గవర్నర్ చింతా మనీ శివకోటి చెప్పారు. ఆర్బీఐ, నేపాల్ లేదా మరే ఇతర దేశాల నుంచి పాత కరెన్సీ నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోలేదని మన దేశ సీనియర్ అధికారులు చెబుతున్నారు. డిమానిటైజేషన్ సమయంలో దీనిపై ఎలాంటి ప్రొవిజన్లను రూపొందించలేదని పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని, భారత ప్రధానితో భేటీ అయి, ఈ విషయంపై చర్చించబోతున్నారు. నేపాల్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్. భారత కరెన్సీని నేపాలీ ప్రజలు, వ్యాపారస్తులు అధికంగా వాడతారు. అయితే ఒక్కసారిగా మోదీ డిమానిటైజేషన్ ప్రకటించడంతో, భారత కరెన్సీ నోట్లను ఇళ్లలో పొదుపు చేసుకున్న నేపాలీ ప్రజలపై ఈ ప్రభావం అధికంగా పడింది. -
నోట్ల లెక్క ఇంకా తేలలేదు
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ముగిసి ఆరు నెలలకు పైగా కావొస్తున్నా ఇంకా ఆ నోట్ల లెక్క తేలలేదు. డీమానిటైజేషన్ తర్వాత పాత నోట్లు ఎన్ని డిపాజిట్ అయ్యాయో ఇంకా లెక్కిస్తూనే ఉన్నామని రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేడు పార్లమెంట్ ప్యానెల్‌కు తెలిపారు. స్పెషల్ టీమ్ ఈ నోట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతుందని, వారంలో ఆరు రోజులు పనిచేస్తూ కేవలం ఆదివారం మాత్రమే సెలవు తీసుకుంటున్నట్టు పటేల్ చెప్పారు. నోట్ల రద్దు చేపట్టినప్పటి నుంచీ ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎన్ని రద్దైన నోట్లు మళ్లీ సిస్టమ్‌లోకి వచ్చాయని సమాజ్‌వాదీ పార్టీ నేత నరేశ్ అగర్వాల్, తృణమూల్ ఎంపీ సాగాటో రాయ్‌లు ఆర్బీఐ గవర్నర్‌ను ప్రశ్నించగా... గతేడాది నవంబర్‌న రూ.17.7 లక్షల కోట్లు చలామణిలో ఉంటే, ప్రస్తుతం రూ.15.4 లక్షల కోట్లు చలామణిలో ఉన్నట్టు పటేల్ తెలిపారు. గతేడాది నవంబర్ 8 ప్రధాని హఠాత్తుగా పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రద్దు చేసిన అనంతరం పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి డిసెంబర్ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. అప్పటిలోగా దేశంలో ఉన్న పాత కరెన్సీ నోట్లన్నంటిన్నీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వాటిని కొత్త కరెన్సీలోకి మార్చుకోవాలని ఆదేశించింది. రద్దయిన నోట్లు ఇంకా నేపాల్ దేశం నుంచి, కోపరేటివ్ బ్యాంకుల నుంచి వస్తున్నాయని పటేల్ చెప్పారు. అంతేకాక పోస్టు ఆఫీసులు ఇంకా పాత నోట్లను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉందన్నారు. నోట్ల రద్దు విషయంలో పటేల్ రెండోసారి పార్లమెంట్ ప్యానల్ ముందు హాజరయ్యారు. ప్యానల్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు లెక్కలు పార్లమెంటులో ప్రవేశపెడతామని పటేల్ చెప్పినట్టు తెలిసింది. పార్లమెంట్ ప్యానల్‌కు అధినేతగా కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ ఉన్నారు. అంతకముందు రెండుసార్లు పటేల్‌కు ప్యానల్ సమన్లు జారీచేయగా.. ఆ కాలంలో ఆర్బీఐకు అత్యంత కీలకమైన ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఉన్నందున పటేల్ మినహాయింపు కోరారు. ఈ కమిటీ టాప్ ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులకు కూడా పెద్ద నోట్ల విషయంలో సమన్లు జారీచేసింది. దీని ప్రభావాన్ని తమ ముందు వెల్లడించాలని ఆదేశించింది. -
ప్రధానికి పాతనోట్లు.. విజిలెన్స్ అవాక్కు!
న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లు అనూహ్యంగా దర్శనమిచ్చి ఢిల్లీ నిఘా విభాగాన్ని తీవ్ర ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓ మెడికల్ కాలేజీ డీన్‌కు వాటిని ప్రధాని ఫండ్ కింద జమచేయండంటూ పంపించాడు. రెండు కవర్లలో రద్దయిన పెద్ద నోట్లు రూ.23,500 పెట్టి వాటిపై 'ఇవి ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్‌ఫండ్‌కు పంపించండి' అని పేర్కొంటూ మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ డీన్ దీపక్ కే తాంపేకు పంపించాడు. ఆ పంపిన వ్యక్తి వివరాలు లేవు. దీంతో డీన్ తాంపే ఆ ప్యాకెట్‌ను ఢిల్లీ నిఘా విభాగానికి పంపించాడు. వాటిని తీసుకున్న నిఘా విభాగం తీవ్ర ఆలోచనలో పడింది. అతడు ఎందుకు ఇలా చేసి ఉంటాడా అని తెగ మదనపడిపోతున్నారు. బహుశా పాత నోట్లను మార్పిడి చేయలేకే అతడు ప్రధాని ఫండ్‌కు పంపించి ఉంటాడని భావిస్తున్నారు. ఆ అజ్ఞాత వ్యక్తిని గుర్తించేందుకు విచారణ ప్రారంభించారు. -
బంగారంగా మారిన నగదెంతో తెలుసా?
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించిన అనంతరం నల్లధనాన్ని తెల్లగా మార్చడం కోసం బ్లాక్‌మనీ హోల్డర్స్ ఒక్కసారిగా బంగారం దుకాణాలకు పరిగెత్తిన సంగతి తెలిసిందే. ఇదే అవకాశంగా తీసుకుని బంగారం వర్తకులు మనీ లాండిరింగ్ కార్యకలాపాలు నిర్వహించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బంగారం వర్తకులపై కొరడా ఝళిపించడం ప్రారంభించింది. దేశరాజధాని పరిధిలోని బంగారం వర్తకులపై ఐటీ డిపార్ట్మెంట్ తాజాగా జరిపిన దాడుల్లో లెక్కల్లో తేలని రూ.250 కోట్ల బంగారం విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాక పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ జరిపిన దాడుల్లో దేశరాజధానిలో రూ.400 కోట్లకు పైగా విలువైన లెక్కల్లో తేలని బులియన్ విక్రయాలు జరిగినట్టు వెల్లడైంది. కరోల్ బాగ్, చాందినీ చౌక్ ప్రాంతాల్లోని నలుగురు బులియన్ డీలర్స్ను శుక్రవారం ఐటీ డిపార్ట్మెంట్ విచారించింది. ఈ విచారణలో గత కొన్ని వారాల్లో రూ.250 కోట్లకు పైగా రద్దయిన నగదును మార్చిపెట్టినట్టు తెలిసింది. ఈ వర్తకులకు సంబంధించిన 12 దుకాణాలు, 8 నివాస ప్రాంతాల్లో ఐటీ డిపార్ట్మెంట్ ఇంకా దాడులు నిర్వహిస్తోంది. మొదటగా రూ.250 కోట్ల రద్దయిన నోట్లను వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా బంగారంలోకి మార్చినట్టు గుర్తించామని ఓ సీనియర్ ఐటీ అధికారి పేర్కొన్నారు. ఈ నలుగురి ట్రేడర్ల దుకాణాలు పాత ఢిల్లీ పరిధిలోని కుచ మహాజని ప్రాంతంలో ఉన్నాయని, మరికొన్ని దుకాణాలు కరోల్ బాగ్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరి బ్యాంకు అకౌంట్లను సైతం అధికారులు విచారిస్తున్నారు. నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దయిన అనంతరం మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే వార్తలతో కుచ మహాజని బులియన్ డీలర్స్‌పై మొదటి రైడ్ నిర్వహించామని, ఆ దాడుల్లో రూ.100 కోట్లకు పైగా గోల్డ్ బార్స్‌ను వీరు విక్రయించినట్టు తెలిసిందని అధికారులు పేర్కొన్నారు. అప్పుడే మనీ లాండరింగ్ రాకెట్ వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ విషయంలో ఈడీ ఇప్పటికే ఇద్దరు బ్యాంకు మేనేజర్లను, ఇద్దరు మధ్యవర్తులను అరెస్టు చేసింది. -
నోట్ల రద్దుతో జీహెచ్ఎంసీకి కాసుల పంట
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో జీహెచ్ఎంసీ ఖజానా నిండుతోంది. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లతో బిల్లులు, బకాయిలు చెల్లించవచ్చన్న వెసులుబాటుతో జీహెచ్ఎంసీకి కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి. ఈ పదిరోజుల్లో రూ.190 కోట్ల పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు. పాత నోట్లతో బిల్లుల చెల్లింపుకు ఈ నెల 24 వరకు గడువుంది.