ప్రజలను మభ్యపెట్టి గెలవాలని బీజేపీ ఏనాడూ ప్రయత్నించలేదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం బీజేపీ శ్రేణులను ఉద్దేశించి నమో యాప్ ద్వారా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.