
శ్రీవారి సన్నిధిలో లంక ప్రధాని
తిరుమల: శ్రీలంక ప్రధాని విక్రమ సింఘె చిత్తూరు జిల్లా తిరుమలలో పర్యటించారు. టీటీడీ అధికారులు ఆయన కుటుంబాన్ని గౌరవపూర్వకంగా రిసీవ్ చేసుకున్నారు. నేటి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబసమేతంగా విక్రమసింఘె శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో లంక ప్రధాని కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించింది. మహారాష్ట్ర నేత, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తిరుమలకు వచ్చి వేకువజామున స్వామివారిని దర్శించుకున్నారు.