చివరి ప్రజెంటేషన్ పూర్తి
చివరి ప్రజెంటేషన్ పూర్తి
Published Sat, Mar 25 2017 11:32 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కర్నూలు(అగ్రికల్చర్): ప్రధానమంత్రి ఎక్స్‌లెన్సీ అవార్డుకు సబంధించి.. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తన చివరి ప్రజెంటేషన్‌ను శనివారం ముగించారు. భూగర్భ జలాల పెరుగుదల వ్యవహారానికి సంబంధించి ప్రధానమంత్రి ఎక్స్‌లెన్సీ అవార్డుకు రాష్ట్రంలోని 8 జిల్లాలు పోటీ పడుతున్నాయి. శనివారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. పోటీలో ఉన్న ఎనిమిది జిల్లాల కలెక్టర్‌లు తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ విజయమోహన్‌తో పాటు జిల్లా నీటియాజమాన్య సంస్థ పీడీ పుల్లారెడ్డి, నీటిపారుదల శాఖ ఎసన్ఫీ చంద్రశేఖర్‌రావు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, భూగర్బ జల వనరుల శాఖ డీడీ రవీందర్‌రావు, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ సెక్రటరీతో మాట్లాడే సమయంలో జిల్లా అధికారులను కలెక్టర్ బయటికి పంపారు. ఫాంపాండ్స్, నీరు–చెట్టు, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో జిల్లాలో భూగర్భజలాలు పెరిగినట్లు వివరించారు.
Advertisement