presantation
-
యూపీఐతో ‘క్రెడిట్ లైన్’ వినియోగం
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్రయోజనాల పరిధిని మరింత పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెస్తోంది. బ్యాంకులు కస్టమర్లకు మంజూరుచేసే ‘ప్రీ–శాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్’నూ యూపీఐ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం, సేవింగ్స్ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలు, ప్రీపెయిడ్ వాలెట్లు, క్రెడిట్ కార్డ్‌లను యూపీఐకి లింక్ చేయవచ్చు. ఇకపై ‘ప్రీ–శాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్’నూ యూపీఐకి అనుసంధానం చేయడానికి వీలవుతుంది. ప్రీ–శాంక్షన్డ్ క్రెడిట్ లైన్ అంటే– బ్యాంకులు రుణ గ్రహీతకు ముందస్తుగా మంజూరుచేసే రుణ సదుపాయం. రుణగ్రహీత ఏ సమయంలోనైనా వినియోగించుకోగలిగే ముందస్తు ఆమోదిత (పరిమితి) రుణం. ఇది క్రెడిట్ చెల్లింపు లాంటిది. దీని కింద (క్రెడిట్ లైన్) తుది వినియోగదారు రుణాన్ని వడ్డీతో తర్వాత తేదీలో తిరిగి చెల్లించవచ్చు. ఈ సదుపాయాన్ని పొందేందుకు యూపీఐ వినియోగదారులు బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ద్వారా తక్షణ నగదు బదిలీ కోసం ఉపయోగించే యూపీఐ లావాదేవీలు ఆగస్టులో 10 బిలియన్ మార్కును దాటాయి. జూలైలో యూపీఐ లావాదేవీల సంఖ్య 9.96 బిలియన్లు (996.4 కోట్లు). జూన్‌లో 9.33 బిలియన్లు. -
చివరి ప్రజెంటేషన్ పూర్తి
కర్నూలు(అగ్రికల్చర్): ప్రధానమంత్రి ఎక్స్‌లెన్సీ అవార్డుకు సబంధించి.. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తన చివరి ప్రజెంటేషన్‌ను శనివారం ముగించారు. భూగర్భ జలాల పెరుగుదల వ్యవహారానికి సంబంధించి ప్రధానమంత్రి ఎక్స్‌లెన్సీ అవార్డుకు రాష్ట్రంలోని 8 జిల్లాలు పోటీ పడుతున్నాయి. శనివారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. పోటీలో ఉన్న ఎనిమిది జిల్లాల కలెక్టర్లు తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ విజయమోహన్‌తో పాటు జిల్లా నీటియాజమాన్య సంస్థ పీడీ పుల్లారెడ్డి, నీటిపారుదల శాఖ ఎసన్ఫీ చంద్రశేఖర్‌రావు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, భూగర్బ జల వనరుల శాఖ డీడీ రవీందర్రావు, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ సెక్రటరీతో మాట్లాడే సమయంలో జిల్లా అధికారులను కలెక్టర్ బయటికి పంపారు. ఫాంపాండ్స్, నీరు–చెట్టు, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో జిల్లాలో భూగర్భజలాలు పెరిగినట్లు వివరించారు.