
సాక్షి, అమరావతి : ఆంధప్రదేశ్ శాసనమండలి సమావేశాలను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం సభలో అనవసర రాద్ధాంతం సృష్టించిన టీడీపీ ఎమ్మెల్సీలు బుధవారం కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. దీంతో మండలి చైర్మన్ షరీఫ్ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ ప్రసారాలు రావడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీలు బుధవారం మండలి వ్యవహారాలకు ఆటంకం కలిగించారు. టీవీ ప్రసారాలకు సాంకేతిక సమస్య తలెత్తిందని.. దానిని పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పినా కూడా టీడీపీ సభ్యులు వినిపించుకోలేదు. మంత్రి సమాధానంతో ఏకీభవించిన మండలి చైర్మన్ షరీఫ్.. టీడీపీ సభ్యులు ఆందోళన విరమించాలని ఆదేశించారు.
అయితే టీడీపీ సభ్యులు మాత్రం చైర్మన్ చెప్పిన కూడా వినిపించికోకుండా.. టీవీ లైవ్‌ల కోసం ఆందోళన కొనసాగించారు. పదే పదే టీవీ ప్రసారాల పేరుతో టీడీపీ సభ్యులు మండలి సమావేశాలను అడ్డుకోవడంపై చైర్మన్ అసహనం చెందారు. టీవీ ప్రసారాలు తప్ప మరే అంశం లేదా అంటూ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.