lu kang
-
భారత్ ఇలా చేయొద్దు..వెంటనే తగ్గాలి: చైనా
బీజింగ్: భారత్ తన రాజీకయ లక్ష్యాలకోసం సిక్కింలోని డోక్లామ్ భూభాగాన్ని పాలసీ టూల్గా ఉపయోగించుకోవద్దని చైనా చెప్పింది. ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు పెరగకుండా ఉండాలంటే భారత్ వెంటనే డోక్లామ్లోని తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవాలని చైనా విదేశాంగ శాఖ కోరింది. విదేశాంగ వ్యవహారాల విషయంలో తమకు భారత్కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని, వీటిపై ముందుకు వెళ్లాలంటే ముందు భారత్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని, అప్పటి వరకు తమ మధ్య సంబంధాలపై ఎలాంటి సమాధానం ఇవ్వలేమని పేర్కొంది. 'అక్రమంగా భారత సరిహద్దు సేనలు డోక్లామ్కు చేరుకున్నాయని తెలిశాక చైనాలోని పలువురు విదేశాంగ ప్రతినిధులు షాకయ్యారు. ఈ విషయం నిజమేనా అని తెలుసుకోవాలనుకుంటున్నారు' అని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి లూకాంగ్ మీడియాకు తెలిపారు. రాజకీయ లక్ష్యాలకోసం భారత్ ఇలాంటి విధానం ఎంచుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. 'భారత్ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితిని భారత్ అర్థం చేసుకొని వెంటనే అక్రమంగా సరిహద్దు దాటి వచ్చిన తన సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాం' అని ఆయన పేర్కొన్నారు. -
మోదీ పాక్ పర్యటనను ప్రశంసించిన చైనా
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక పాకిస్థాన్ పర్యటన నేపథ్యంలో భారత్-పాక్ సంబంధాలను స్వాగతిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి లు కాంగ్ మాట్లాడుతూ.. భారత్, పాక్ సంబంధాల మెరుగుపడటం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. అలాగే ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి తమ మద్దతు ఉంటుందని, చర్చలు కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత్, పాక్ సంబంధాలు మెరుగుపడటం ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని చైనా తెలిపింది. పొరుగు దేశాలతో మైత్రిని కోరుకుంటూ మోదీ చేస్తున్న దౌత్యం, పాక్ పర్యటనను పలు దేశాలు పొగడ్తలతో ముంచెత్తాయి.