గత కొన్ని రోజులుగా ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలను గురువారం వరణుడు పలకరించాడు.
హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలను గురువారం వరణుడు పలకరించాడు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన జల్లులు పడగా.. మరికొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది.
గురువారం సాయంత్రం కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వడగళ్ల వానతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పండ్ల తోటల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.