రైలు ప్రయాణంలో తకరారు.. వరంగల్‌ వరకే తిరుపతి–కరీంనగర్‌ రైలు.. | - | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణంలో తకరారు.. వరంగల్‌ వరకే తిరుపతి–కరీంనగర్‌ రైలు..

Published Fri, Jul 28 2023 1:52 AM | Last Updated on Fri, Jul 28 2023 8:57 AM

- - Sakshi

కరీంనగర్‌: భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్నింటిని అధికారులు పాక్షికంగా రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లించారు. ఈ ఆకస్మిక పరిణామంతో జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రద్దు, పాక్షిక రద్దు, దారి మళ్లిన రైళ్ల వివరాలిలా ఉన్నాయి..

► సికింద్రాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ గురు, శుక్రవారాల్లో రద్దయ్యాయి.

► సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–సికింద్రాబాద్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ గురువారం రద్దవగా శుక్రవారం ఉదయం కూడా రద్దు చేశారు.

► సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ మధ్య నడిచే కాగజ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘన్‌పూర్‌–సికింద్రాబాద్‌ మధ్య నడుపుతున్నారు. ఘన్‌పూర్‌–కాగజ్‌నగర్‌ వరకు రద్దు చేశారు. ఈ మూడు రైళ్ల వల్ల నిత్యం హైదరాబాద్‌ వెళ్లాల్సిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

► తిరుపతి–కరీంనగర్‌ బైవీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను వరంగల్‌కే పరిమితం చేశారు. వరంగల్‌–కరీంనగర్‌ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. పిల్లాపాపలతో తిరుమల దర్శనానికి వెళ్లిన వారంతా లగేజీతో వర్షంలో తడుస్తూ తిరిగి బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.

► సికింద్రాబాద్‌–పాట్నా వెళ్లే దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ పెద్దపల్లి, రామగుండం నుంచి వెళ్లాల్సి ఉండగా విజయవాడ మీదుగా దారి మళ్లించారు.

► చైన్నె–అహ్మదాబాద్‌ వెళ్లాల్సిన నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ను పెద్దపల్లి, మంచిర్యాల కాకుండా వాడి–సికింద్రాబాద్‌ మీదుగా మళ్లించారు.

► న్యూఢిల్లీ–హైదరాబాద్‌ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను బల్లార్షా–ఆదిలాబాద్‌–ముత్కేడ్‌ జంక్షన్‌ మీదుగా నిజామాబాద్‌ నుంచి దారి మళ్లించారు.

► గోరక్‌పూర్‌–సికింద్రాబాద్‌ రైలును పెద్దపల్లి–కరీంనగర్‌– నిజామాబాద్‌ మీదుగా దారి మళ్లించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement