
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో వడగాల్పులు నమోదవుతున్నాయి. రానున్న నాలుగు రోజులు పలుచోట్ల వడగాల్పుల తీవ్రంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సూచనలు ఇవ్వాలని సూచించింది.