
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొన్నాళ్లుగా వాతావరణం పొడిగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో మార్పు వల్ల ఉక్కపోత ఉంటోంది. తాజాగా గాలుల దిశ మారిన కారణంగా తూర్పు, ఆగ్నేయ గాలులు రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.
అదే సమయంలో తేలికపాటి జల్లులు లేదా వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణశాఖ శనివారం ఓ నివేదికలో తెలిపింది. రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల జల్లులు కురవవచ్చని పేర్కొంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులకు ఆస్కారం ఉందని అంచనా వేసింది.