Very Severe Cyclone Biparjoy To Intensify In Next 24 Hours, Says IMD - Sakshi
Sakshi News home page

Cyclone Biparjoy: అత్యంత తీవ్ర రూపం దాల్చనున్న బిపోర్‌జాయ్‌.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు

Published Sat, Jun 10 2023 12:19 PM | Last Updated on Sat, Jun 10 2023 1:21 PM

Very Severe Cyclone Biparjoy To Intensify In Next 24 Hours Says IMD - Sakshi

అరేబియాలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ #CycloneBiparjoy తుపాను అత్యంత తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చి.. భారీ వర్షాలకు కారణమవుతుందని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 

బిపోర్‌జాయ్‌ ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే.. కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. మత్స్యకారులు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తుపాను ఉధృతి పెరిగే సమయంలో బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి. తుపాన్‌ మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా పయనించనుంది. ప్రస్తుతం గోవాకు 690 కి.మీ. దూరంలో పశ్చిమాన.. ముంబైకి పశ్చిమనైరుతి దశలో 640 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది.  భారీ అలల కారణంగా గుజరాత్‌ ఫేమస్‌ తితాల్‌ బీచ్‌ను అధికారులు నాలుగు రోజులపాటు మూసేశారు. 

ఇదీ చదవండి: ఒడిశా ప్రమాద ఘటనాస్థలిలో దుర్వాసన.. ఇంకా శవాలున్నాయా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement