సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తర్వాత నైరుతి రుతుపవనాల్లో కాస్త కదలిక వచ్చింది. దాదాపు మూడు వారాల నుంచి ఇవి స్తబ్ధుగా ఉండిపోయాయి. ప్రస్తుతం ఈ రుతుపవనాలు కోస్తాంధ్రపై మోస్తరుగా ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు రాష్ట్రంపై నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
ప్రస్తుత అంచనాల ప్రకారం.. పశ్చిమ, నైరుతి గాలులు, రుతుపవనాల ప్రభావం రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఉంటుంది. ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
కాగా.. శనివారం చిత్తూరు జిల్లా రామాపురంలో 3.1 సెం.మీ., తిరుపతి జిల్లా అరణ్యకండ్రిగ, నంద్యాల జిల్లా చిలకలూరు, అనంతపురం జిల్లా చిటికలపల్లె 2.7, సత్యసాయి జిల్లా గోరంట్లలో 2.4, ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో 2.3 సెం.మీ.చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment