మే నెల ముగిసింది.. సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళలోకి రుతుపవనాలు ఎంటర్ అవుతాయి. ఒక వారం రోజులు అటూ ఇటూగా ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది. కానీ జూన్ రెండోవారం దాటినా ఇంకా వరణుడి జాడ మాత్రం కనిపించడం లేదు. ఇంకా భానుడి భగభగలతో జనాల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలు ఎందుకీ పరిస్థితి ఉంది? వర్షాకాలం మొదలైనా ఇంకా ఎందుకు ఎండలు మండిపోతున్నాయి? అసలు వర్షాలు పడేదెప్పుడు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
గడిచిన 15 రోజుల్లో జిల్లాలో సాధారణ వర్షపాతం 75.3. మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఒక్క చినుకు కూడా రాలలేదు. నైరుతి రుతు పవనాలు ఇంకా కేరళ తీరాన్ని తాకలేదు.మండుతున్న ఎండలు చూస్తుంటే ఇప్పట్లో వర్షాలు కురిసే పరిస్థితి కనబడడం లేదు. వర్షాకాలంలోనూ ఇంకా ఎండలు మండిపోతూనే ఉన్నాయి. జూన్ రెండో వారం దాటినా.. ఇంకా రాష్ట్రంలో భానుడు సెగలు కక్కుతున్నాడు.
రికార్డు స్థాయిలో పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేర రికార్డ్ అవుతున్నాయి. ప్రస్తుతం హీట్‌వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాకాలం కాస్త ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది.ప్రతి ఏటా జూన్ మాసం నుంచే వర్షాలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి.
జూన్ మొదటి వారంలోనే కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఆలస్యంగా అంటే, 8వ తేదీన కేరళను తాకాయి. అక్కడి నుంచి రుతుపవనాలు విస్తరించడానికి 5 రోజుల సమయం పడుతుంది.నైరుతి రుతుపవనాల రాక ఆలస్యంతోనే ఎండలు మండిపోతున్నాయని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో పశ్చిమ దిశ, ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, ఆ కారణంగా ఇంకా ఎండలు మండుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రుతుపవనాల రాక ఆలస్యం అయినా ఒక్కసారి అవి ఎంటర్ అయ్యాక సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment