Monsoons effect
-
‘నైరుతి’లో కదలిక
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తర్వాత నైరుతి రుతుపవనాల్లో కాస్త కదలిక వచ్చింది. దాదాపు మూడు వారాల నుంచి ఇవి స్తబ్ధుగా ఉండిపోయాయి. ప్రస్తుతం ఈ రుతుపవనాలు కోస్తాంధ్రపై మోస్తరుగా ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు రాష్ట్రంపై నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం.. పశ్చిమ, నైరుతి గాలులు, రుతుపవనాల ప్రభావం రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఉంటుంది. ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. శనివారం చిత్తూరు జిల్లా రామాపురంలో 3.1 సెం.మీ., తిరుపతి జిల్లా అరణ్యకండ్రిగ, నంద్యాల జిల్లా చిలకలూరు, అనంతపురం జిల్లా చిటికలపల్లె 2.7, సత్యసాయి జిల్లా గోరంట్లలో 2.4, ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో 2.3 సెం.మీ.చొప్పున వర్షపాతం నమోదైంది. -
ప్రకృతి వైపరీత్యాలతో 2,038 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రుతుపవనాల కారణంగా సంభవించిన వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 2,038 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా బిహార్‌లో 518 మంది, ఆ తర్వాతి స్థానంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో 330 మంది చనిపోయారని వివరించింది. ఏప్రిల్ 1–ఆగస్ట్ 17వ తేదీ మధ్య కాలంలో వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో 101 మంది జాడ తెలియకుండా పోగా 1,584 మంది గాయపడినట్లు పేర్కొంది. వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు ఘటనలతో 335 జిల్లాలు ప్రభావితమైనట్టు తెలిపింది. -
జూన్ రెండోవారం దాటినా.. వర్షాల జాడేది? ఇంకా మండుతున్న ఎండలు
మే నెల ముగిసింది.. సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళలోకి రుతుపవనాలు ఎంటర్ అవుతాయి. ఒక వారం రోజులు అటూ ఇటూగా ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది. కానీ జూన్ రెండోవారం దాటినా ఇంకా వరణుడి జాడ మాత్రం కనిపించడం లేదు. ఇంకా భానుడి భగభగలతో జనాల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలు ఎందుకీ పరిస్థితి ఉంది? వర్షాకాలం మొదలైనా ఇంకా ఎందుకు ఎండలు మండిపోతున్నాయి? అసలు వర్షాలు పడేదెప్పుడు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం. గడిచిన 15 రోజుల్లో జిల్లాలో సాధారణ వర్షపాతం 75.3. మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఒక్క చినుకు కూడా రాలలేదు. నైరుతి రుతు పవనాలు ఇంకా కేరళ తీరాన్ని తాకలేదు.మండుతున్న ఎండలు చూస్తుంటే ఇప్పట్లో వర్షాలు కురిసే పరిస్థితి కనబడడం లేదు. వర్షాకాలంలోనూ ఇంకా ఎండలు మండిపోతూనే ఉన్నాయి. జూన్ రెండో వారం దాటినా.. ఇంకా రాష్ట్రంలో భానుడు సెగలు కక్కుతున్నాడు. రికార్డు స్థాయిలో పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేర రికార్డ్ అవుతున్నాయి. ప్రస్తుతం హీట్‌వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాకాలం కాస్త ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది.ప్రతి ఏటా జూన్ మాసం నుంచే వర్షాలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. జూన్ మొదటి వారంలోనే కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఆలస్యంగా అంటే, 8వ తేదీన కేరళను తాకాయి. అక్కడి నుంచి రుతుపవనాలు విస్తరించడానికి 5 రోజుల సమయం పడుతుంది.నైరుతి రుతుపవనాల రాక ఆలస్యంతోనే ఎండలు మండిపోతున్నాయని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో పశ్చిమ దిశ, ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, ఆ కారణంగా ఇంకా ఎండలు మండుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రుతుపవనాల రాక ఆలస్యం అయినా ఒక్కసారి అవి ఎంటర్ అయ్యాక సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. -
జిల్లాను తాకిన ఆశల ‘నైరుతి’
అనంతపురం అగ్రికల్చర్: ‘నైరుతి’ రుతుపవనాలు సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాను తాకినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన ఛాయాచిత్రం స్పష్టం చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నైరుతి విస్తరించి ప్రభావం చూపిస్తే మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ నుంచి అక్టోబర్ 15 వరకు నైరుతి ప్రభావంతోనే వర్షాలు కురవనున్నాయి. ఈ ఖరీఫ్‌లో 319.6 మి.మీ సాధారణ వర్షపాతంగా పరిగణించారు. అనుకున్న ప్రకారం జూన్, జూలైలో వర్షాలు కురిస్తే 4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 నుంచి జూలై ఆఖరు వరకు పంటల సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. కాగా రాగల రెండు రోజులు జిల్లాకు తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు రేకులకుంటలోని వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే.అశోక్‌కుమార్ తెలిపారు. -
రాష్ట్రమంతటా రుతుపవనాల విస్తరణ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రమంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు పోరుబందర్, భావ్‌నగర్, ఖాండ్వా, గోండియా, దుర్గ్, భవానీపట్నం, కళింగపట్నం గుండా వెళుతోంది. అలాగే ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగింది. దీంతో రాగల మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, చాలా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశముందని తెలిపింది. ఇతర ప్రాంతాల్లోతేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలావుండగా, గత 24 గంటల్లో మహబూబాబాద్‌లో 15 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా ముధోల్‌లో 13 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలో 12, అశ్వారావుపేటలో 9, మహబూబాబాద్ జిల్లా మల్యాల్‌లో 8, జగిత్యాల జిల్లా వెలగటూరు, వరంగల్ జిల్లా పర్వతగిరి, కరీంనగర్‌లలో 7సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. -
మరో ఐదురోజుల్లో రుతుపవనాలు ఏపీలో ప్రవేశించే అవకాశం
-
బాబోయ్ ఉక్కపోత! మరోవారం ఇంతేనట!!
సాక్షి, సిటీబ్యూరో: రుతుపవనాలకు బ్రేక్ పడడంతో నగరంలో మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండ వేడిమితో ఒక్కసారిగా ఉక్కపోత పెరిగింది. రుతుపవనాలు వెస్ట్ బెంగాల్ వైపు మళ్లాయని..శీతల గాలులు సైతం ఉత్తరదిశ వైపు వీస్తున్నందున నగరంలో పగటి ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో 33 నుంచి 35 డిగ్రీల వరకు పెరిగాయని..గాలిలో తేమ శాతం 50 శాతానికంటే తక్కువగా నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘సాక్షి’కి తెలిపారు. మరో వారం రోజులపాటు నగర వాతావరణ పరిస్థితిలో పెద్దగా తేడాలుండవని..ఆ తర్వాత రుతుపవనాల దిశ మారే అవకాశం ఉందని, గాలిలో తేమ శాతం పెరగడం, ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలిక పాటి వర్షాలుకురిసే అవకాశాలున్నట్లు వివరించారు. కాగా నగరంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కపోత పెరగడంతో విద్యుత్ వినియోగం సైతం పెరిగింది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లతో సిటీజనులు సేదదీరారు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు ఎండవేడిమితో సతమతమయ్యారు. ఈ సీజన్లో జూన్ ఒకటి నుంచి జూలై 31 వరుస నగరంలో పలు మండలాల్లో సాధారణం కంటే 40 నుంచి 50 శాతం అధిక వర్షపాతం నమోదైన విషయం విదితమే. -
వెళ్లిపోయిన అల్పపీడనం!
-
వెళ్లిపోయిన అల్పపీడనం!
- విదర్భ వైపు కదలడంతో రాష్ట్రంపై తగ్గిన తీవ్రత - రుతుపవనాల ప్రభావంతో మరో 4 రోజులు సాధారణ వర్షాలు సాక్షి, హైదరాబాద్: వారం రోజులపాటు రాష్ట్రాన్ని వణికించిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. రాష్ట్రంపై నెలకొన్న అల్పపీడనం విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లిపోవడంతో ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొంది. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండడంతో మరో 4 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా సాధారణ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చేనెల ఒకటి లేదా రెండో తేదీల్లో బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అధికారులు పేర్కొన్నారు. దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని.. ఆవర్తనం ఏర్పడి, అల్పపీడనంగా మారితే మళ్లీ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇక గత 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, ఆదిలాబాద్‌లలో 7 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైంది. మోర్తాడ్, ఖానాపూర్, లింగంపేటలలో 6, నిజామాబాద్, సారంగాపూర్, తిమ్మాపూర్, సుల్తానాబాద్, బిక్నూర్, గాంధారి, హన్మకొండ, చింతకానిలలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది.