- విదర్భ వైపు కదలడంతో రాష్ట్రంపై తగ్గిన తీవ్రత
- రుతుపవనాల ప్రభావంతో మరో 4 రోజులు సాధారణ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వారం రోజులపాటు రాష్ట్రాన్ని వణికించిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. రాష్ట్రంపై నెలకొన్న అల్పపీడనం విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లిపోవడంతో ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొంది. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండడంతో మరో 4 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా సాధారణ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చేనెల ఒకటి లేదా రెండో తేదీల్లో బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అధికారులు పేర్కొన్నారు.
దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని.. ఆవర్తనం ఏర్పడి, అల్పపీడనంగా మారితే మళ్లీ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇక గత 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఆదిలాబాద్‌లలో 7 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైంది. మోర్తాడ్, ఖానాపూర్, లింగంపేటలలో 6, నిజామాబాద్, సారంగాపూర్, తిమ్మాపూర్, సుల్తానాబాద్, బిక్నూర్, గాంధారి, హన్మకొండ, చింతకానిలలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది.
వెళ్లిపోయిన అల్పపీడనం!
Published Tue, Sep 27 2016 3:04 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
Advertisement