వారం రోజులపాటు రాష్ట్రాన్ని వణికించిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. రాష్ట్రంపై నెలకొన్న అల్పపీడనం విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లిపోవడంతో ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొంది. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండడంతో మరో 4 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా సాధారణ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చేనెల ఒకటి లేదా రెండో తేదీల్లో బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అధికారులు పేర్కొన్నారు.
Published Tue, Sep 27 2016 10:08 AM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
Advertisement