న్యూఢిల్లీ: హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షం నగర ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు అక్కడక్కడా పిడుగులు కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలో భారత వాతావారణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. మరొకొన్ని రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది.
తూర్పు మధ్య అరేబియా సముద్రంపై తుపాను ప్రసరణ ఉందని తెలిపింది ఐఎండీ. ఈ ప్రభావం రాబోయే 4-5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని.. ఇది క్రమంగా బలహీనపడి ఉత్తరం వైపు కదులుతూ ఉంటుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపింది.
(చదవండి: కోస్తాంధ్రకు మరో తుపాను!)
గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, కర్ణాటక తీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ తీరం ప్రాంతం, తమిళనాడు, పాండిచరి రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, పాండిచేరి, తమిళనాడు రాష్ట్రాల్లో అక్టోబర్10-12 మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
చదవండి: మీ స్మార్ట్‌ఫోన్‌తో తుపాన్లను ఎలా ట్రాక్ చేయాలో తెలుసా...!
Comments
Please login to add a commentAdd a comment