
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం, దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర–దక్షిణ ద్రోణి ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి కోమెరిన్∙ ప్రాంతం వరకు 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అమరావతి కేంద్రం శనివారం రాత్రి ప్రకటించింది.
► ఉత్తర కోస్తాంధ్రా, దక్షిణ కోసాంధ్రా, రాయలసీమల్లో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
► శనివారం పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. అనేక చోట్ల ఒక టి లేదా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.
Comments
Please login to add a commentAdd a comment