రుతుపవనాల సూచన తేదీల మార్పు | IMD to change reference dates for monsoon onset | Sakshi
Sakshi News home page

రుతుపవనాల సూచన తేదీల మార్పు

Published Fri, Jan 17 2020 5:49 AM | Last Updated on Fri, Jan 17 2020 5:49 AM

IMD to change reference dates for monsoon onset - Sakshi

న్యూఢిల్లీ: మారుతున్న వర్షపాతం విధానంతో రుతుపవనాల సూచనల తేదీలలో మార్పులుంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ ఏడాది నుంచి నైరుతి రుతుపవనాల సూచన తేదీలను ఉపసంహరించుకున్నట్లు ఎర్త్‌సైన్స్‌ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. రుతుపవనాల సూచనల తేదీల మార్పు పంటలు సాగు చేసేందుకు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొంది. జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌గా పేర్కొంటారు. కేరళ మీదుగా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 నాటికే వస్తాయని, అయితే మిగతా రాష్ట్రాలు, నగరాల్లో ఈ తేదీలో మార్పులుంటాయని తెలిపింది. అయితే, మధ్య భారత వాతావరణ శాఖ కూడా ఈ రుతుపవనాల సూచన తేదీలను మార్పు చేస్తుందని పేర్కొంది.  ఏప్రిల్‌లో విడుదలచేసే అవకాశముందని  వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement