
సాక్షి, హైదరాబాద్: ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఇది 13వతేదీ నాటికి మరింత బలపడే అవకాశం ఉందని, దీని ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్న కారణంగా శుక్రవారం రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment