Hypotension
-
11న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఇది 13వతేదీ నాటికి మరింత బలపడే అవకాశం ఉందని, దీని ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్న కారణంగా శుక్రవారం రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. -
రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి,హైదరాబాద్: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో చాలాచోట్ల ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు వాతావరణశాఖ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. కాగా, అల్పపీడనం కారణంగా శనివారం జనగాం జిల్లా ఘనపూర్, కామారెడ్డిలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లెలో 6, జగిత్యాల జిల్లా మల్లాపూర్, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరులో 4 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు తెలిపింది. -
మరో రెండు రోజులు వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదు కావొచ్చని, ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు 5.43 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 23 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 10 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. వాంకిడిలో రికార్డు వర్షపాతం కుమ్రంభీం జిల్లా వాంకిడి మండలంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 371 మిల్లీమీటర్లు వర్షపాతం నమెదైంది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
ఉత్తర కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
విశాఖ: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశావైపు అల్పపీడనం కదులుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రకు రెండ్రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్టణం తీరం వెంబడి గంటకు 45-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేటకు మత్య్సకారులు ఎవరూ వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
హైపో టెన్షన్ (లో బి.పి) లక్షణాలు...
ముందు జాగ్రత్త చూపు చెదరడం (బ్లర్డ్ విజన్), జలుబుతోపాటు చెమటతో దేహం చల్లబడడం, చర్మం పాలిపోవడం, అయోమయం, తల తిరగడం, స్పృహతప్పడం, ఊపిరి వేగంగా తీసుకోవడం, గుండె కొట్టుకోవడంలో ఒడుదొడుకులు, ఆయాసం, ఏకాగ్రత లోపించడం, తల తేలిగ్గా తేలిపోతున్నట్లు అనిపించడం, వాంతులు, మగతగా ఉండడం, నీరసంగా అనిపించడం... వగైరా! ఇవన్నీ ఏకకాలంలో ఉంటాయని కాదు. ఒకే లక్షణం ఉండవచ్చు, ఏవైనా నాలుగైదు అంతకంటే ఎక్కువ లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటే రక్తపోటు పరీక్ష చేయించుకుని ఆ తర్వాత తగిన చికిత్స చేయించుకోవాలి. ఈ కాలంలో దేహం నీటిని కోల్పోవడంతో (డీహైడ్రేషన్) రక్తపోటు పడిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి వాంతులు, జ్వరం, నీరసం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే మార్కెట్లో కొనుక్కున్న ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని కానీ, ఇంట్లోనే తయారు చేసుకున్న (మరుగుతున్న నీటిలో చక్కెర, ఉప్పు కలపాలి) ద్రావణాన్ని కానీ తాగాలి.