హైపో టెన్షన్ (లో బి.పి) లక్షణాలు...
ముందు జాగ్రత్త
చూపు చెదరడం (బ్లర్‌డ్ విజన్), జలుబుతోపాటు చెమటతో దేహం చల్లబడడం, చర్మం పాలిపోవడం, అయోమయం, తల తిరగడం, స్పృహతప్పడం, ఊపిరి వేగంగా తీసుకోవడం, గుండె కొట్టుకోవడంలో ఒడుదొడుకులు, ఆయాసం, ఏకాగ్రత లోపించడం, తల తేలిగ్గా తేలిపోతున్నట్లు అనిపించడం, వాంతులు, మగతగా ఉండడం, నీరసంగా అనిపించడం... వగైరా! ఇవన్నీ ఏకకాలంలో ఉంటాయని కాదు. ఒకే లక్షణం ఉండవచ్చు, ఏవైనా నాలుగైదు అంతకంటే ఎక్కువ లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటే రక్తపోటు పరీక్ష చేయించుకుని ఆ తర్వాత తగిన చికిత్స చేయించుకోవాలి.
ఈ కాలంలో దేహం నీటిని కోల్పోవడంతో (డీహైడ్రేషన్) రక్తపోటు పడిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి వాంతులు, జ్వరం, నీరసం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే మార్కెట్‌లో కొనుక్కున్న ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని కానీ, ఇంట్లోనే తయారు చేసుకున్న (మరుగుతున్న నీటిలో చక్కెర, ఉప్పు కలపాలి) ద్రావణాన్ని కానీ తాగాలి.