ఉలవపాడు (కందుకూరు): ఉలవపాడుకు చెందిన రషీద్‌కు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె మాధిహాపాతిమా (6). రషీద్ మసీదులో మౌషమ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఫౠతిమా ఉలపాడులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ప్రస్తుతం ఎల్‌కేజీ చదువుతోంది. ఈ క్రమంలో గత ఏప్రిలోలో జ్వరం రావడంతో పలు ఆస్పత్రుల్లో చూయించారు. ఎంతకూ తగ్గకపోగా డెంగీ అనే భయంతో చికిత్స కోసం చెన్నై తీసుకెళ్లారు. అక్కడ చిన్నారి ఫాతిమాను పరీక్షించిన వైద్యులు క్యాన్సర్‌గా నిర్ధారించారు. అదీ బ్లడ్ క్యాన్సర్‌గా తేల్చారు. అక్యూట్ లింఫోబిలాస్టిక్ లుకేమియాగా గుర్తించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధితో పాపకు తరుచూ జ్వరం రావడం, ఇతర ఇన్‌ఫెక్షన్‌లు సోకుతున్నట్లు వైద్యులు తెలిపారని పాప తండ్రి రషీద్ చెప్తున్నారు.
చికిత్స అందిస్తే 70 శాతం వరకు కోలుకుని పాప బతికే అవకాశం ఉందని, అందుకు రూ. 10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. కేవలం దేవుని సేవలో బతికే రషీద్ ప్రస్తుతం అంత ఖర్చు భరించలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పటికే శక్తికి మించి రూ.2.50 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇటీవలే పాపకు మెడ వద్ద ఓ ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స అందిస్తున్నారు. చెన్నై బేబీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నా ప్రతిపారీ వైద్య పరీక్షలైతేనేమి, ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. ఎవరైనా ముందుకొచ్చి తమ బిడ్డకు సాయం చేస్తే ఎలాగైనా పాతను బతికించుకుంటామని వేడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో దాతలు ముందుకొచ్చి సాయం అందిస్తే ఓ చిన్నారి ప్రాణాలను నిలబెట్టి ఆ కుటుంబంలో సంతోషం నింపిన వారవుతారు.
రషీద్ అకౌంట్ నంబర్
ఆంధ్రాబ్యాంకు 211810100016761,
ఐఎఫ్‌సీ కోడ్ ఏఎన్‌డీబీ 0002118,
ఉలవపాడు. ఫోన్ నంబర్ 9908091106
నంబర్‌ను సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment