మే 23 వ‌ర‌కు తెలంగాణ‌, ఏపీలో అతి భారీ వ‌ర్షాలు | Heavy Rains To Continue In Parts Of Telangana And AP Until May 23rd, More Details Inside | Sakshi
Sakshi News home page

IMD Rainfall Weather Report: మే 23 వ‌ర‌కు తెలంగాణ‌, ఏపీలో అతి భారీ వ‌ర్షాలు

Published Sat, May 18 2024 3:24 PM | Last Updated on Sat, May 18 2024 6:08 PM

Heavy Rains to continue in parts of Telangana And AP Until May 23

సాక్షి, హైద‌రాబాద్‌/విజయవాడ:  వాతావరణంలో మార్పుతో రాష్ట్రవ్యాప్తంగా ఎండతీవ్రత, వడగాడ్పులు గణనీయంగా తగ్గాయి. ఎక్కడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించడం లేదు. అంతేగాక ఈ నెలలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తరుచూ వానలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణశాఖ మరో చల్లటి కబురు చెప్పింది.

ద‌క్షిణ అండ‌మాన్ స‌ముద్రంలో నైరుతీ రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నాయి. రేప‌టికి (మే 19) బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాల‌పై నైరుతీ రుతుప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే సూచ‌న‌లు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

అల్ప‌పీడ‌నం బ‌ల‌ప‌డి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవ‌కాశం ఉందని పేర్కొన్నారు. కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ మీదుగా శ్రీలంక వ‌రకు ఉప‌రిత‌ల ద్రోణి ఆవ‌రించింది. స‌ముద్ర‌మ‌ట్టానికి 3.1 కి.మీ. ఎత్తున ఉప‌రిత‌ల ద్రోణి కొన‌సాగుతోంది.

దీని కారణంగా మే 23వ తేదీ వ‌ర‌కు కూడా తెలంగాణ‌, ఏపీలో మోస్త‌రు నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనిపేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement