‘కడెం’ వద్ద పర్యాటకుల సందడి
కడెం : కడెం ప్రాజెక్టు జలాశయం వద్ద ఆదివారం పర్యాటకులతో సందడి కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వాహనాల్లో భారీగా తరలివచ్చి ఇక్కడి బోట్లలో జలాశయంలో విహరించారు. సెల్ఫీలు తీసుకున్నారు. గుట్టలు, పచ్చదనంతో అలుముకున్న ప్రకృతి అందాలను చూసి మురిసిపోయూరు. ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉండడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.