కడెంను సందర్శించిన ‘మండలి ’డెప్యూటీ చైర్మన్
Published Mon, Aug 1 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
కడెం : శాసనమండలి డెప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ సోమవారం కడెంను సందర్శించారు. అక్కడి పడవలో ఎక్కి జలాశయంలో విహరించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పూల రవీందర్, రిటైర్డ్ డీఐజీ గంగాధర్, టీఆర్‌ఎస్ నేతలు రాఘవేందర్, చింతల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులున్నారు. వీరికి జన్నారం డీఎఫ్‌వో రవీందర్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
కడెం ప్రాజెక్టు సందర్శించిన డీఆర్వో
జిల్లా రెవెన్యూ అధికారి సంజీవరెడ్డి సోమవారం కడెం ప్రాజెక్టు సందర్శించారు. ప్రాజెక్టు వరదగేట్లు,నీటిమట్టం తాజాస్థితి, తదితర వివరాల గురించి ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు వద్ద ఫోటోలు దిగారు. ఆయన వెంట కడెం తహసీల్దార్ నర్సయ్య, ఆర్‌ఐలు బాబారావు, రవీందర్ తదితరులున్నారు.
Advertisement
Advertisement