sivam
-
శివమ్ సైనికి స్వర్ణం
పెనాంగ్ (మలేసియా): కామన్వెల్త్ వెరుుట్లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో భారత లిఫ్టర్ శివమ్ సైనీ రెండు పతకాలు సాధించాడు. జూనియర్ విభాగంలో సైని స్నాచ్‌లో 132 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 168 కిలోలు బరువు ఎత్తి స్వర్ణం సాధించాడు. ఇక సీనియర్ 94 కేజీల విభాగంలో శివమ్ సైనీ రజతం గెలిచాడు. స్నాచ్‌లో 132, క్లీన్ అండ్ జర్క్‌లో 168లతో మొత్తం 300 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. -
శివమెత్తించే... ప్రేమ
కొత్త సినిమా గురూ! శివమ్ తారాగణం: రామ్, రాశీఖన్నా, అభిమన్యు సింగ్, వినీత్‌కుమార్, బ్రహ్మానందం, పాటలు: భాస్కరభట్ల, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, నిర్మాత: ‘స్రవంతి’ రవికిశోర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి, నిడివి: 168 నిమిషాలు, రిలీజ్: అక్టోబర్ 2 లవ్‌స్టోరీ ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘శివమ్’తో దర్శకుడైన శ్రీనివాసరెడ్డి గతంలో సురేందర్ రెడ్డి దగ్గర ‘కిక్’, ‘రేసుగుర్రం’ లాంటి చిత్రాలకు పనిచేశారు. దాదాపు 34 మంది ఆర్టిస్టులున్న ఈ సినిమాకైన బడ్జెట్ సుమారు రూ. 20 కోట్లు మొత్తం వర్కింగ్ డేస్ 87. ఊటీ, హైదరాబాద్, నార్వే, స్వీడన్లలో షూటింగ్. నార్వే, స్వీడన్లలో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా ఇదే. అక్కడ డ్రోన్ కెమేరాలు వాడారు. సినిమా రచనలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. కథ అనుకొని దానికి తగ్గట్లు సీన్లు రాసుకోవడం సంప్రదాయంగా అందరూ అనుసరించే విధానం. అయితే, ఒక్కోసారి ప్రేక్షక జనాన్ని మెప్పించే తపనలో, సీన్లు అనుకొని కథలు కూడా వండుకోవడమూ సహజం. అలాంటి ఆసక్తికరమైన సీన్లు, ఎపిసోడ్లన్నీ కలసి తెరపై సినిమాగా పరిణమిస్తే, కొన్నిసార్లు కథ కన్నా సీన్లదే ఎక్కువ ప్రాధాన్యమ వుతుంది. చిత్ర నిర్మాణంలో ముప్ఫయ్యో ఏట అడుగుపెట్టిన ‘శ్రీస్రవంతీ మూవీస్’ సంస్థ నుంచి మాస్ ఎంటర్టైనర్గా వచ్చిన ‘శివమ్’ సినిమా చూసినప్పుడు ఈ ఆలోచనలన్నీ మెదులుతాయి. కథ ఏమిటంటే...: ఇది శివ (రావ్‌ు) అనే కుర్రాడి కథ. అతనిది ఒక విలక్షణ తత్త్వం. ప్రేమికుల పెళ్ళిళ్ళకు ఇంట్లో పెద్దలు అభ్యంతరపెడుతున్నారని తెలిస్తే చాలు... నేరుగా తాను బరిలోకి దిగిపోతాడు. పెద్దవాళ్ళతో ఫైట్లు చేసి మరీ, ప్రేమికుల జంటను కలుపుతూ ఉంటాడు. అలా అప్పటికి 112 పెళ్ళిళ్ళు చేయించాడా కుర్రాడు. ఆ క్రమంలో జడ్చర్ల పట్నాన్ని గడగడలాడించే భోజిరెడ్డి (వినీత్ కుమార్) అనే విలన్ మనుషుల్ని కొట్టి, వాళ్ళకు శత్రువవుతాడు. అలాంటి కుర్రాడు రైలులో వెళుతూ, ఒకమ్మాయి ఏదో షూటింగ్ కోసం అన్న ‘ఐ లవ్ యూ’ అన్న మాటను సీరియస్‌గా తీసుకుంటాడు. ఆ అమ్మాయినీ, ఆమె ప్రేమనూ వెతుక్కుంటూ వెళతాడు. అదే టైవ్‌ులో పోయిన పరువును తిరిగి తెచ్చుకోవడం కోసం భోజిరెడ్డి మనుషులు హీరో కోసం వెతుకుతుంటారు. మరోపక్క అభిమన్యు సింగ్ అనే మరో విలన్ కూడా హీరో కోసం వెతుకుతుంటాడు. అతనెందుకు వెతుకుతున్నాడన్నది కాసేపు సస్పెన్స. తీరా హీరో కనిపించినప్పుడు అతణ్ణి వదిలేసి, హీరోయిన్ను కిడ్నాప్ చేసుకొని వెళతాడతను. అక్కడికి ఇంటర్వెల్. విలన్ దగ్గర నుంచి ఆమెను హీరో రక్షించడం, హీరో పనిపట్టడం కోసం ఇద్దరు విలన్ల మధ్య ఒప్పందం కుదరడం లాంటివన్నీ తర్వాతి కథ. ఒక దశలో హీరోయిన్‌తో ప్రేమ కన్నా, ప్రేమించినవాళ్ళను ఏకం చేయడం వైపే హీరో మొగ్గుతాడు. అలా ఎందుకన్నది ఫ్లాష్ బ్యాక్. అదేమిటి, హీరో అసలు ‘శివ’ అని పేరు పెట్టుకోవడానికీ, తాను పెళ్ళి చేసిన ప్రేమికుల మొదటి బిడ్డకు ‘శివ’ అని వచ్చేలా పేరు పెట్టమనడానికీ కారణం ఏమిటి, ప్రేమ అనే విషయం వచ్చేసరికి అతనెందుకు శివమెత్తుతాడు, చివరకు విలన్ల కథెలా కంచికి చేరిందన్నది మిగతా సినిమా. తెర నిండా యాక్టర్లే...: ‘ఎనర్జిటిక్ స్టార్’ బిరుదాంకితుడైన యువ హీరో రామ్ఆ పేరుకు తగ్గట్లు నటించారు. మొదటి నుంచి చివరి దాకా హుషారుగా, ఎందరినైనా కొట్టి, ఏదైనా సాధ్యం చేయగల వీరాధివీరుడి తరహా పాత్రలో కనిపిస్తారు. ఇక, క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఘట్టంలో పొడవాటి జుట్టున్న విగ్లో విభిన్నంగా, విచిత్రంగా ఉన్నారు. ప్రేమిస్తున్నాననే విషయాన్ని కూడా నేరుగా చెప్పడంలో కూడా ‘ఇగో’ ఫీల్ అయ్యే కథానాయిక తనూజగా హీరోయిన్ రాశీఖన్నాది విగ్రహపుష్టి. ఈ చిత్రంలో విలన్లు ఒకరు కాదు - ఇద్దరు. ఒకరు అభిమన్యు సింగ్, రెండో వ్యక్తి వినీత్ కుమార్. కానీ, చిత్రంగా ఈ ప్రతినాయక పాత్రల్లో ఏదీ బలంగా కనిపించదు. విలన్లు కూడా కామెడీ చేయడమనే కాన్సెప్ట్‌తో కథను తీర్చిదిద్దుకోవడం అందుకు ఒక కారణం. బలమైన విలన్లు, సన్నివేశాలు, సందర్భాలు లేనప్పుడు హీరోనెంత గొప్పగా చూపినా, హీరోయిజవ్‌ు ఎంతవరకు ఎలివేటవుతుందన్నది ప్రశ్న. వీళ్ళు కాక - కామెడీ కోసం బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి నుంచి సప్తగిరి, ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్.... ఇలా లెక్కేసుకుంటూ పోతే, ఆ పేర్ల జాబితానే కొండవీటి చాంతాడు. ఇటీవలి కాలంలో తన అమాయకపు డైలాగుల చిన్న చిన్న పాత్రలతోనే అలరిస్తున్న ‘ఫిష్’ వెంకట్ కూడా ఉన్నారు. కనిపించే కొద్ది సీన్లలో ఎవరికి వారు తమ వంతు నవ్వించడానికి ప్రయత్నించారు. ఇక, హీరో తండ్రి పాత్రలో పోసాని కృష్ణమురళి, హీరోయిన్ తండ్రి పాత్రలో గాయకుడు మనో లాంటి పేరున్న తారలూ కనిపిస్తారు. అప్పటికే సినిమా నిడివి 2 గంటల 48 నిమిషాలు కావడం వల్ల కావచ్చు... వారిని ఇంకా వినియోగించుకొనే సీన్లకు అవకాశం కష్టమైనట్లుంది. అలాగే, తండ్రి పోసాని పాత్ర గన్ను పుచ్చుకొని మరీ హీరోను కనిపిస్తే... కాల్చేస్తానంటూ తిరగడం వెనుక కారణం ఏమిటన్నది చెప్పడం మర్చిపోయినట్లున్నారు. అనుభవం నిండిన టెక్నీషియన్ వర్క్: శ్రీనివాసరెడ్డికి దర్శకుడిగా ఇది తొలిసినిమా. కథ కూడా ఆయన రాసుకున్నదే. పాత్రల పరిచయం, కథ ఎస్టాబ్లిష్‌మెంట్‌తోనే సినిమా ఫస్టాఫ్ అంతా గడిచిపోతుంది. దానికి మూడు పాటలు, కొన్ని ఫైట్లు అదనం. చిన్న ట్విస్ట్ దగ్గర ఫస్టాఫ్ ఆగినా, సెకండాఫ్ మొదట్లోనే ఆ ట్విస్ట్‌ను బయటపెట్టేస్తారు. ఇక, ఆ తరువాత అంతా టావ్‌ు అండ్ జెర్రీ తరహాలో హీరోకూ, విలన్లకూ మధ్య జరిగే ప్రిడి కథ. హీరో స్వభావానికీ కారణం తెలిపే ఫ్లాష్‌బ్యాక్ కథ చివరాఖరుకు వస్తుంది. అప్పటి దాకా ఆసక్తినీ, సహనాన్నీ కోల్పోకుండా నిలుపుకోవాలి. మాటల రచయిత కిశోర్ తిరుమల ఉన్నా, ఆ క్రెడిట్‌నూ దర్శకుడు కూడా పంచుకున్న ఈ సినిమాలో, ముఖ్యంగా ఫస్టాఫ్‌లో డైలాగ్స కొంత బాగున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో ‘నా కోసం నువ్వేమీ ప్రేమించక్కర్లేదు...’ లాంటి 2-3 పాటలు బాగున్నాయి. నార్వే, స్వీడన్ లాంటి చోట్ల అందమైన లొకేషన్లను కెమేరాలో బంధించిన తీరూ బాగుంది. పీటర్ హెయిన్ ఫైట్స్ సరేసరి. ఇలాంటి అనుభవజ్ఞులైన నిపుణులతో పాటు నిర్మాణ విలువలూ పుష్కలమే. ఇన్ని సమకూరిన సినిమాలో సీన్లు, పాటలు, ఫైట్లూ ఉన్నాక... ఇంకా కథ గురించి ఆలోచించడం ఎందుకు? -
ఆ రెండు నెలలు లవ్ ఫెయిల్యూర్లో ఉన్నట్లనిపించింది!
స్మయిల్... స్టయిల్... ఎనర్జీ... ఈ మూడింటినీ మిక్స్ చేస్తే రామ్. ఆన్స్క్రీన్లోనైనా, ఆఫ్ స్క్రీన్‌లోనైనా రామ్ చురుకుదనం చూస్తే... చిన్నప్పుడు బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా, కాంప్లాన్ అన్నీ కలగలిపి తాగేశాడేమో అనిపిస్తుంది. యూత్, మాస్ హార్ట్స్‌లో తనదైన సిగ్నేచర్ చేసిన రామ్ రేపు ‘శివమ్’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా గురించి, కెరీర్ గురించి బోలెడన్ని క్వశ్చన్స్ అడిగితే టకటకా ఆన్సర్లు చెప్పేశారు రామ్. సరిగ్గా నాలుగు నెలల క్రితం పండగ చేసుకున్నారు. ఇప్పుడు శివమెత్తడానికి రెడీ అయ్యారు..? (నవ్వుతూ...) అవునండి. నాలుగు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలతో తెరపై కనిపించడం హ్యాపీగా ఉంది. ‘పండగ చేస్కో’ హిట్టవడం ఎంకరేజింగ్‌గా అనిపించింది. శ్రీనివాస రెడ్డి డెరైక్ట్ చేసిన ‘శివమ్’ కూడా బాగుంటుంది. ‘శివమ్’లో ఏం చేస్తారేంటి? లైఫ్‌లో పుట్టుకా, చావనేది మన చేతుల్లో ఉండదు. కానీ, పెళ్లి మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకని నచ్చిన అమ్మాయి దొరికితే, ఆ అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఫైట్ చెయ్ అని ఈ చిత్రంలో చెబుతాం. కొంతమంది అగ్రెసివ్‌గా ఉంటారు. ఆ క్షణంలో ఏదనిపిస్తే, అది చేసేస్తారు. ఇందులో నేను అలాంటి అబ్బాయిని. అందులోనే ఫన్ ఉంటుంది. రాశీఖన్నాతో మీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి? ‘పండగ చేస్కో’ కోసం తొమ్మిది కిలోలు తగ్గా. ఈ సినిమాకి పెరిగా. ఈ చిత్రానికి రాశీ ఖన్నాను అనుకున్నప్పుడు, బబ్లీగా ఉంటుంది కాబట్టి, మా జంట బాగుంటుందా అనుకున్నాం. కానీ, నేను కూడా బరువు పెరగడంతో పెయిర్ బాగుంది. ఆ మధ్య మీరు నటించిన చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఆ సమయంలో ఎలా ఫీలవుతుంటారు? ఫ్యాన్స్‌నీ, బయ్యర్స్నీ డిజప్పాయింట్ చేశాం అని రెండు, మూడు రోజులు గిల్టీగా ఉంటుంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఈ ఫీలింగ్ ఎక్కువగా ఉండేది. ‘జగడం’ అప్పుడు చాలా బాధపడ్డాను. ఎవరితోనూ మాట్లాడే వాణ్ణి కాదు. రెండు నెలలు ఎవర్నీ కలవలేదు. ఆ రెండు నెలలు లవ్ ఫెయిల్యూర్లో ఉన్నట్లనిపించింది. నాకూ, సుక్కూ (దర్శకుడు సుకుమార్)కీ ఆ సినిమా మీద చాలా నమ్మకం. కానీ, మా నమ్మకం వమ్ము అయింది. మీ రీసెంట్ హిట్ ‘పండగ చేస్కో’ పూర్తి సంతృప్తి మిగిల్చిందా? కమర్షియల్‌గా హ్యాపీ. కానీ, చిన్న వెలితి ఉంది. అది ఏంటనేది తెలియదు. ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉంటే బాగుండేది. సెకండాఫ్‌లో విలనింట్లో హీరో సెటిలవడం రొటీన్ అనిపించిందేమో! నిజమే. అదే వెలితి అనిపించిందేమో. యాక్చువల్‌గా ముందు కథలో అది లేదు. ఆ తర్వాత అలా అయిపోయింది. ‘శివమ్’లో మాత్రం ఎవరింట్లోనూ దూరను (నవ్వుతూ). రాబోయే చిత్రాల్లో అలాంటి ఎపిసోడ్స్ లేకుండా జాగ్రత్త పడతా. జనరల్‌గా మీరు కథలు సెలక్ట్ చేసుకునే తీరు ఎలా ఉంటుంది? కథ వినే ముందే సినిమా చూడ్డానికి వెళుతున్నట్లుగా అనుకుంటా. కథను విజువలైజ్ చేసుకుంటా. సో... కథ వింటు న్నప్పుడే సినిమా చూసేస్తా. బాగుందనిపిస్తే, ఒప్పుకుంటా. మీరెక్కువ కమర్షియల్ ఫిల్మ్స్‌కే పరిమితమవుతున్నట్లున్నారు. చాలా ప్రయోగాలు కూడా చేశా. అవి ఆదరణ పొందక పోవడంతో హిట్ అయిన నా కమర్షియల్ సినిమాలే గుర్తుంటు న్నాయి. ‘దేవదాసు’ కమర్షియల్ హిట్. ‘జగడం’ ఓ ప్రయోగం. ‘రెడీ’ ఓ ట్రెండ్ సెట్టర్. ‘మస్కా’ రెగ్యులర్ కమర్షియల్ మూవీ. ‘గణేశ్’ పిల్లల కోసం చేశా. ’ఎందుకంటే ప్రేమంట’ ఓ ప్రయోగం. ‘కందిరీగ’ కమర్షియల్ మూవీ. ‘ఒంగోలు గిత్త’ మిర్చి యార్డ్ బ్యాక్ డ్రాప్‌తో చేశాం. ‘మసాలా’లో చేసిన ‘గే’ పాత్ర కూడా ప్రయోగమే. ‘పండగ చేస్కో’ కమర్షియల్ హిట్ మూవీ. నేను చేసిన ప్రయోగాలు హిట్ కాకపోవడంతో వెలుగులోకి రావడంలేదు. ఇక ప్రయోగాలకు దూరమా? దూరంగా ఉండను. కానీ, కమర్షియల్ ఎలి మెంట్స్ ఉండేలా చూసుకుంటా. ‘ఎందుకంటే ప్రేమంట’ ఈ తరహా మూవీనే. టీవీల్లో వచ్చినప్పుడు చూసి, చాలా బాగుంది అంటుంటారు. థియేటర్లో ఎందుకు చూడలేదో తెలియడం లేదు. టీవీలో చూసి, బాగుందన్నప్పుడు కోపం వస్తుంది (నవ్వుతూ). ఓకే. ‘పండగ చేస్కో’, ‘శివమ్’, ‘హరికథ’... ఒకేసారి మూడు సినిమాలు చేయడం కష్టం అనిపించలేదా? ఏప్రిల్ 10న పొల్లాచ్చిలో ‘హరికథ’, 11న హైదరాబాద్‌లో ‘శివమ్’, 12న ఆర్ఎఫ్సీలో ‘పండగ చేస్కో’ షూటింగ్స్ చేశా. అంటే మూడు రోజుల్లో మూడు రకాల పాత్రల్లో ఒదిగిపోవా లన్నమాట. కొంచెం టైర్డ్గానే ఉంటుంది. కానీ, దర్శకులు ఇచ్చే జోష్‌తో అలసటపోతుంది. ఈ చిత్రాల దర్శకులు అలాంటివాళ్ళే. మీరెక్కువగా మీ సొంత సంస్థలోనే చేస్తుంటారు. కారణం? డెరైక్టర్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు నిర్మాతను కూడా సెలక్ట్ చేసుకుంటే వాళ్లకే ఓకే చెప్పేస్తాను. కేవలం కథతో మా దగ్గరకు వస్తే, అప్పుడు మా బేనర్లోనే చేస్తాం. కథలు కూడా ముందు పెదనాన్నగారు (స్రవంతి రవికిశోర్) వింటారు. ఆయన ముప్ఫయ్యేళ్ల అనుభవం నాకు హెల్ప్ అవుతుంది. హీరోగా మీ స్థానం ఏంటి? ప్రతి శుక్రవారం మారిపోయే స్థానం గురించి పెద్దగా పట్టించుకోను. ఇక్కడ హిట్ ముఖ్యం. స్థానం గురించి ఆలోచించే బదులు మంచి స్క్రిప్ట్స్ వెతుక్కునే పని మీద ఉంటే మంచిది. అలా కాకుండా స్థానాన్ని ఎనలైజ్ చేసుకుంటూ ఉంటే స్క్రిప్ట్స్ చేజారిపోతాయ్. రజనీ కాంత్ రేంజ్‌కి వెళ్లినా ఇంకా పెరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. రేంజ్ అనేది ‘నెవర్ ఎండింగ్ ప్రాసెస్’. చేసే పాత్రలను నేనెక్కువగా ఎనలైజ్ చేసుకుంటూ ఉంటా. ఇంకా కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది? అనే విషయం మీద దృష్టి పెడతాను. ‘హరికథ’ ఎందాకా వచ్చింది? కిశోర్ తిరుమల దర్శకత్వంలో తయారవుతున్న ‘హరికథ’ 70 శాతం పైగా పూర్తయ్యింది. డిసెంబర్లో విడుదల చేస్తాం. తమిళంలో మంచి ఇంట్రడక్షన్ కోసం చూస్తున్నా! చెన్నైలో పుట్టి, పెరగడం వల్ల నాకు తమిళం బాగా వచ్చు. ఎంత బాగా అంటే, ‘ఎందుకంటే ప్రేమంట’ డబ్బింగ్‌కి తెలుగులో వారం రోజులు తీసుకుంటే, తమిళంలో రెండు రోజుల్లో చెప్పేశాను. తెలుగులో ‘దేవదాస్’ నాకు మంచి ఇంట్రడక్షన్ అయ్యింది. తమిళంలో కూడా అలాంటి చిత్రం ద్వారా ఇంట్రడ్యూస్ అయితే బాగుంటుంది. ఆరేడేళ్లుగా తమిళంలో మంచి సినిమా చేయాలనే ప్రయత్నం మీద ఉన్నా. ‘ర్యామ్’డమ్ థాట్స్ ఎందులో ఆనందం ఉందో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుని పని చేస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. ఒక సీన్ ఎలివేట్ అయ్యేలా డైలాగ్స్ రాసేవాడు రైటర్. ఒక డైలాగ్ ఎలివేట్ అయ్యేలా సీన్ తీసేవాడు డెరైక్టర్. ఎవరైనా ఏదైనా అన్నా... అనుకున్నా... అనకుండా ఉన్నా... నువ్వు అనుకున్నదేదో చేసెయ్. ప్రాణం చాలా విలువైనది. దాన్ని బలి చేయకు. నీ కోసం బ్రతకడం ఇష్టం లేనప్పుడు, అవతలివాళ్ల కోసం బ్రతకడం మొదలుపెట్టు. ఐయామ్ గుడ్ అనుకుంటే పైకి వస్తావ్. ఐయామ్ గాడ్ అనుకుంటే పైకి పోతావ్. ఒక్క అక్షరమే తేడా. -
కడెం ఆయకట్టు రైతులు సాగుకు సిద్ధం
కడెం, న్యూస్‌లైన్ : కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శుభవార్త. ఈయేడు కడెం ఆయకట్టుకు రబీ సీజన్లో నీరివ్వనున్నారు. ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. జలసాధన సమితి ఆధ్వర్యంలో రైతుల ఆందోళనలు ఫలించా యి. ఈ రబీకి నీరిస్తారా లేదా అని రైతులు వేయి కళ్లతో ఎదురుచూశారు. ఒక దశలో ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని నీరివ్వమని అధికారులు ప్రకటించినా ఎట్టకేలకు సందిగ్ధత తొలగింది. మూడేళ్లుగా ప్రాజెక్టులో నీరు సక్రమంగా లేకపోవడంతో రబీ పంటకు నీరు ఇవ్వలేదు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురియడంతో నీటి విడుదలకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల ‘శివం’ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధికారులు కడెం ప్రాజెక్టు తాజా పరిస్థితిపై వివరించారు. దీంతో ప్రభుత్వం నీటి విడుదలకు పచ్చజెండా ఊపింది. నీటిని వచ్చే నెల 20వ తేదీ నుంచి ఇవ్వాలని సూచన ప్రాయంగా అంగీకరించారు. దీంతో కడెం, దండేపల్లి, జన్నారం, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాల్లోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏరువాక సాగడానికి సన్నద్ధం అవుతున్నారు. వరి, ఆరుతడి పంటలు వేయడానికి రెడీ అవుతున్నారు.