కడెం, న్యూస్‌లైన్ : అన్నదాతపై ప్రకృతి కన్నెర్రజేసింది. కష్టపడి పండిం చిన పంట వర్షార్పణం అయింది.దీంతో రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. కడెం మండలంలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి అంబారీపేట, పాండ్వాపూరు, లింగాపూరు తదితర గ్రామాల్లో చాలా వరకు రైతుల ధాన్యం దెబ్బతింది. పాండ్వాపూరు గ్రామంలోని ఐకేపీ వారి ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యం అంతా తడిసిపోయింది. కేంద్రంలో అమ్ముకునేందుకు తెచ్చిన రైతు ల ధాన్యం కూడా తడిసింది. కేంద్రంలో దాదాపు 2వేల క్విం టాళ్ల ధాన్యం తూకం చేసేందుకు తెచ్చిన ధాన్యం నీటిపాలైం ది.
ఇక్కడ వీరబత్తుల రమేశ్, గోపు సత్తన్న, ఎండీ లాయక్, ముద్దసాని లక్ష్మణ్, బండి శంకర్, బండి అంజన్న, పిన్నం అంజన్నలతో పాటు పలువురు రైతుల ధాన్యం తడిసింది. అంబారీపేట గ్రామంలోని పీఏసీఎస్ వారి కేంద్రంలోని ధాన్యం కూడా వర్షానికి తడిసింది. కేంద్రంలో గల 1755 సంచులు ఇంకా వేముల రాయలింగు, అల్లంల భూమన్న, అల్లంల గంగన్న, పసుల రాజన్న, ఎంకోసి రాజన్న, బైరి భూమన్న, బూస మల్లేశ్, కొప్పుల నర్సయ్యలతో పాటు చాలా మంది ధాన్యం తడిసింది. కేంద్రంలో రైతులు తమ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. గ్రామం చివరన గల వేముల శేఖర్‌కు చెందిన పంట భూమిలో అతని వరి కుప్పపై పిడుగు పడడంతో ఆ కుప్ప మొత్తం దగ్ధమైంది.
ధాన్యం.. వర్షార్పణం
Published Thu, May 22 2014 1:59 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement