
ప్రతీకాత్మక చిత్రం
కడెం(ఖానాపూర్): మండలంలోని కొండుకూరు గ్రామానికి చెందిన మద్ది శ్రావణ్(24) గురువారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై అజయ్‌బాబు తెలిపిన వివరాలివీ..శ్రావణ్ మండలంలోని పాండ్వాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. కాని మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ప్రేమించిన అమ్మాయి గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దీంతో మనస్తాపానికి చెందిన యువకుడు మద్దిపడగ గ్రామసమీపంలోని అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుంటుంబీకులు అపస్మారక స్థితిలో ఉన్న యువకున్ని 108లో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి పోశవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment