కడెం : మావోయిస్టుల వారోత్సవాలు సోమవారం నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూనే మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
కడెం మండలంలో...
ఒకప్పుడు కడెం మండలం మావోయిస్టుకు వారికి కంచుకోటగా ఉండేది. కానీ మారిన పరిస్థితుల కారణంగా క్రమంగా మావోయిస్టుల ఉనికి చాలా వరకు తగ్గింది. మండలంలోని సమీప అటవీ గ్రామాలైన అల్లంపల్లి, గంగాపూరు, కల్లెడ, దోస్తునగర్, ఉడుంపూరు, ఇస్లాంపూరు, గండిగోపాల్‌పూర్, మైసంపేట, ధర్మాజీపేట, సింగాపూరు తదితర గ్రామాలన్నీ వారికి ఎంతగానో అనుకూలంగా ఉండేవి. దీంతో ఈ ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కొద్ది రోజులుగా ఇక్కడ ప్రధాన రహదారిపై అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిఘా ఉంచారు. అపరిచిత, అనుమానిత వ్యక్తుల ఏగురించి తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులకు రక్షణ పెంచారు. మావోయిస్టు వారోత్సవాల దృష్ట్యా తాము పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం.వాహనాల తనిఖీని ముమ్మరంగా చేపట్టాం.రాత్రి వేళ పెట్రోలింగును పెంచాం.స్థానికంగా ఇందుకు సంబందించిన అన్ని చర్యలను తీస్కున్నాం.పోలీస్టేషను వద్ద భద్రతను పెంచాం. ప్రజా ప్రతినిధులను కూడా అప్రమత్తం చేశాం.
వాహనాల తనిఖీలు
ఖానాపూర్ : మండలంలోని తర్లపాడ్ గ్రామంలో బాసర-మంచిర్యాల 222 ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోకి మావోయిస్టులు చొరబడ్డారనే అనుమానంతో పోలీసులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రంతోపాటు మండలంలోని వేర్వేరు చోట్ల పలు సందర్భాల్లో ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానం ఉన్న వారి వివరాలు సేకరించారు. జిల్లా ఉన్నతాధికారులతోపాటు సీఐ ఎల్.జీవన్‌రెడ్డి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు ఎస్సై సునిల్ తెలిపారు.
అంతా అప్రమత్తం!
Published Mon, Jul 28 2014 12:36 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement