మావోయిస్టుల స్కెచ్ : త్రుటిలో తప్పిన ప్రమాదం | Maoists Fixed Bomb For DRG Jawans In Odisha | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన ప్రమాదం

Published Mon, Oct 1 2018 7:12 AM | Last Updated on Tue, Oct 9 2018 2:49 PM

Maoists Fixed Bomb For DRG Jawans In Odisha - Sakshi

మావోయిస్టులు అమర్చిన మందుపాతర , బాంబును నిర్వీర్యం చేస్తున్న జవాన్లు

మల్కన్‌గిరి: డీఆర్‌జీ జవాన్లు త్రుటిలో ప్రమాదం తప్పించుకున్నారు. మావోయిస్టుల వల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. మందుపాతర పేలకుండానిర్వీర్యం చేయగలిగారు. మల్కన్‌గిరి జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో దోర్నిపాల్‌ సమితి గోరుగొండ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. డీఆర్‌జీ జవాన్లు ఆదివారం ఉదయం ఈ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ విషయం ముందుగా తెలుసుకున్న మావోయిస్టులు గోరుగొండ గ్రామం పరిసరాల్లో రోడ్డుపై సుమారు 5 కేజీల ఐఈడీ బాంబును అమర్చారు.

అయితే అదే దారిలో కూంబింగ్‌కు వెళుతున్న జవాన్లు దీనిని ముందుగా గుర్తించి చాకచక్యంగా తప్పించుకుని మందుపాతరను నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో జవాన్లు కూంబింగ్‌ను ముమ్మరం చేశారని ఎస్పీ సందీప్‌కుమార్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement