భరంపూర్: ఒడిశాలో ఐదేళ్ల కిందటి శక్తిమంతమైన మందుపాతరను భద్రతా బలగాలు వెలికి తీశాయి. అనంతరం నిర్వీర్యం చేశాయి. అది ఒక వేళ పేలిపోయి ఉంటే భారీ స్థాయిలో ప్రాణనష్టం చోటుచేసుకొని ఉండేదని పోలీసులు తెలిపారు.
ఒడిశాలో మావోయిస్టుల ఏరి వేత చర్యల్లో భాగంగా గజపతి జిల్లాలో పానిగండా అనే గ్రామంలో పోలీసులు, ప్రత్యేక బలగాలు కలిసి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఓ శక్తిమంతమైన ల్యాండ్ మైన్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం జాగ్రత్తగా దానిని వెలికి తీసి పరిశీలించగా ఐదేళ్ల కిందటే మావోయిస్టులు దానిని పాతి పెట్టి ఉంచారనే అంఛనాకు వచ్చారు. దీనిని గుర్తించిన అనంతరం మరింత అప్రమత్తమైన బలగాలు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మరింత విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు.
ఐదేళ్ల కిందటి ల్యాండ్ మైన్ వెలికితీత
Published Mon, Jan 11 2016 1:58 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement