హుస్నాబాద్: పార్లమెంట్‌లో అవిశ్వాసంపై జరిగిన చర్చలో టీఆర్‌ఎస్ ఏడు మండలాల గురిం చి ఫోకస్ చేసిందే తప్ప విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన అంశాలపై మాట్లాడలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సీపీఐ అమరుల భవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య ఉన్న ఒప్పం దంతోనే పరోక్షంగా టీఆర్‌ఎస్ తటస్థంగా ఉండి బీజేపీకి మద్దతు తెలిపిందని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో పేర్కొన్న అంశాలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. టీడీపీ చర్చను ప్రారంభించినా ఎవరి రాజకీయ కోణంలో వారు మాట్లాడారే తప్ప ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆగస్టు మొదటి వారంలో సీపీఐ తరఫున ఢిల్లీకి వెళ్లనున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment