cheating wife
-
అత్తింటి ఎదుట యువతి మౌనపోరాటం
-
బెడ్రూంలో భార్యను వేరొకరితో చూసి..
అలబామా: అలబామాలో ఓ భర్త ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన భార్య చేసిన మోసానికి అతడికి చిర్రెత్తిపోయింది. ఇంట్లోని పడకగదిలో తన భార్య పక్కన వేరొకరిని చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే భార్య బాయ్‌ఫ్రెండ్‌పై శివమెత్తాడు. పిడిగుద్దులు కురిపిస్తూ తన్నులతో చుక్కలు చూపించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అలబామాలో ఓ వ్యక్తి బయటకు పనిమీద వెళ్లాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. ఆ సమయంలో తన భార్య ఓ వ్యక్తితో అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన భర్తకు కోపం కట్టలు తెంచుకుని ఒక్కసారిగా తన భార్యతో ఉన్న వ్యక్తిపై దాడికి దిగాడు. తన భర్త ఆవేశాన్ని చూసి భయంతో భార్య పారిపోగా ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను మాత్రం ఆ భర్త చితక్కొట్టాడు. ఇదంతా కూడా ఆ భర్తతోపాటు వచ్చిన మరో వ్యక్తి వీడియో తీశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. -
బెడ్రూంలో భార్యను వేరొకరితో చూసి..
-
భార్య, ఆమె ప్రియుడ్ని చితకబాదేశాడు..
ఓ యువకుడు తన భార్యను చూడకూడని స్థితిలో చూశాడు. అంతే ఆవేశం కట్టలు తెంచుకుంది. భార్యను, ఆమె ప్రియుడ్ని పట్టుకుని ఇంట్లోనే వరండాలో రెండు స్తంభాలకు వేర్వేరుగా తాడుతో కట్టేశాడు. అతను కట్టె, తాడు తీసుకుని ఇద్దరిని చితకబాదాడు. పిల్లలు, చుట్టుపక్కల వాళ్లు చూస్తుండగానే అతను ఆవేశంతో పలుమార్లు కొట్టాడు. దెబ్బల నుంచి తప్పించుకునేందుకు స్తంభం చుట్టు తిరిగినా అతను వెంటబడి కొట్టాడు. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు కచ్చితంగా తెలియవు. అయితే బిహార్ రాష్ట్రంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె చీర కట్టుకుని భారత సంప్రదాయ దుస్తుల్లో ఉండగా, ఆమె ప్రియుడు ఫ్యాంట్, టీ షర్ట్ ధరించి ఉన్నాడు. ఈ దృశ్యాలను ఎవరు వీడియో తీశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఇదో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది బాధిత భర్తకు మద్దతు తెలపగా, మరికొందరు గృహహింస కింద అతణ్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కుటుంబం పరువు కోసమే భర్త.. తన భార్య, ఆమె ప్రియుడ్ని కొట్టాడని, దీన్ని గృహహింసగా పరిగణించరాదని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా అతని హింసాత్మక చర్యలను ఎలా సమర్థిస్తారంటూ మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
భార్యను ట్రాప్ చేసిన టెకీ: విడాకులకు ఓకే
బెంగళూరు: భార్యపై తనకున్నది అనుమానం కాదని, ఆమె మోసకారేనని కోర్టుకు నిరూపించి విడాకులు పొందాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో టెకీ భర్త టెక్నాలజీ సాయంతో భ్యార్య మోసాన్ని వెలుగులోకి తెచ్చాడు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న 31ఏళ్ల యువకుడు భార్య, మూడేళ్ల కూతురితో కలిసి బెంగళూరు సిటీలోని ఓ ఫ్లాట్ లో ఉంటున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో అతనికి మెదటిసారి భార్యపై అనుమానం వచ్చింది. సిగరెట్ తాగేవాళ్లెవ్వరూలేని తన ఇంట్లో ఒక మూలన కాల్చిపారేసిన సిగరెట్ పీకను గుర్తించిన టెకీ.. భార్యను అడగ్గా, తనకేమీ తెలియదని బుకాయించిందామె. పెరిగిన అనుమానంతో భార్యపై నిఘా పెట్టిన టెకీ ఇంట్లో ఆమెకు తెలియకుండా నాలుగైదుచోట్ల కెమెరాలు ఏర్పాటుచేశాడు. అప్లికేషన్లను వినియోగించి భార్య ఫోన్ ను తన లాప్ టాప్ కు అనుసంధానం చేశాడు. దాదాపు నాలుగు అనుమానాన్ని నివృత్తిచేసే ఆధారాలేవీ దొరకలేదు. కానీ జులైలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని, వచ్చేటప్పుడు గర్భనిరోదక మాత్రలు తెమ్మని చెప్పిన మాటలు టెక్కీ చెవినపడ్డాయి. ఇక కెమెరాలు వాటిపని అవి చేసుకుపోయాయి. లివింగ్ రూమ్ లో, బాత్ రూమ్ లో, బెడ్ రూమ్ లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె సాగించిన లీలలన్నీ రికార్డయ్యాయి. ఆ ఫుటేజీలను చేతబట్టుకుని నేరుగా కోర్టుకు వెళ్లిన టెక్కీ తనకు విడాకులు కావాలని అభ్యర్థించాడు. కోర్టు ఆదేశానుసారం వీడియో రికార్డులను పరీక్షించిన బెంగళూరు మీడియేషన్ సెంటర్ (బీఎంసీ) అధికారులు అవి నిజమైనవేనని, ఎలాంటి మార్పులు చేయలేదని నిర్ధారించాయి. దీంతో కోర్టు ఆ టెకీకి విడాకులు మంజూరుచేసింది. పాప సంరక్షణ బాధ్యతలు కూడా తండ్రికే అప్పగించింది.